- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పుడు సైన్యంలో.. ఇప్పుడు వీధుల్లో.. పెన్షన్‌తో కాదు, ప్యాషన్‌తో బతికే దాదీ!
ఒకప్పుడు ఆమె భారత సైన్యంలో ఉన్నతాధికారిగా క్రమశిక్షణ, బాధ్యతల మధ్య గౌరవంగా సేవలందించింది. దేశరక్షణ కోసం నిరంతరం కృషిచేసిన ఆమె, పదవీ విరమణ తర్వాత కూడా ఆ అంకితభావాన్ని విడిచిపెట్టలేదు.

దిశ, వెబ్ డెస్క్: ఒకప్పుడు ఆమె భారత సైన్యంలో ఉన్నతాధికారిగా క్రమశిక్షణ, బాధ్యతల మధ్య గౌరవంగా సేవలందించింది. దేశరక్షణ కోసం నిరంతరం కృషిచేసిన ఆమె, పదవీ విరమణ తర్వాత కూడా ఆ అంకితభావాన్ని విడిచిపెట్టలేదు. ఇప్పుడు అదే ఆత్మవిశ్వాసంతో, అదే ఉత్సాహంతో, ఆమె ఇండోర్ నగర వీధుల్లో ఓ చిన్న ఫుడ్ స్టాల్ నడుపుతూ ప్రజలకు రుచికరమైన వంటకాలను అందిస్తున్నారు. 79 ఏళ్ల వయస్సులో ఒంటరిగా జీవిస్తూ, ఆమె చిన్న వ్యాపారాన్ని ఎంతో ప్రేమగా నిర్వహిస్తున్న తీరు ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారిన ఈ దాదీ కథేంటో తెలుసుకుందాం.
కాశిష్ సోని అనే సోషల్ మీడియా (Social media) యూజర్ తాజాగా 79 ఏళ్ల వృద్ధురాలి వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) షేర్ చేశారు. వీడియోలోని దాదీ ఆమె ఒకప్పుడు ఆర్మీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా (Administrative Officer in the Army) పనిచేసినట్లు తెలిపింది. రిటైర్మెంట్ తర్వాత ఆమెకు ఎంతో ఇష్టమైన కుకింగ్‌ను జీవనాధరంగా ఎంచుకుంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ (Indore) నగర వీధుల్లో ఓ ఫుడ్ స్టాల్‌ను నిర్వహిస్తోంది. ఆమె ముంబైలో ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తిచేసినట్లు వెల్లడించింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఆ బామ్మ అస్సలు వివాహమే చేసుకోలేదు. పెళ్లి చేసుకుంటే తన ఇష్టాన్ని కొనసాగించలేకపోయేదాన్ని అని ఆమె సమాధానమిచ్చింది. ఇక ఆ దాదీ జీవితంలో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఎంతో ఆనందంగా సంతృప్తిగా జీవిస్తున్నానని ధీమాగా చెబుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోకు 3.2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెను తెగ మెచ్చుకున్నారు.






