- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral News : పదిలక్షల విలువైన పావురాల చోరీ.. షాక్ లో యజమాని
తాను 20 ఏళ్లుగా పెంచుతున్న 10 లక్షల విలువైన 400 పావురాలు చోరికి(Pegions Stolen) గురవడం చూసి షాక్ తిన్నాడు యజమాని.

దిశ, వెబ్ డెస్క్ : తాను 20 ఏళ్లుగా పెంచుతున్న 10 లక్షల విలువైన 400 పావురాలు చోరికి(Pegions Stolen) గురవడం చూసి షాక్ తిన్నాడు యజమాని. కాగా అన్నేసి పావురాలు ఎలాంటి శబ్దం రాకుండా ఎత్తుకు పోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఉత్తరప్రదేశ్(UP) లోని మీరట్(Meerat) లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. లిసాది గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గత 20 ఏళ్లుగా పావురాలు పెంచుతున్నాడు. దాదాపు 10 లక్షల విలువైన 400 పావురాలను తన వద్ద ఉన్న ప్రత్యేక బోనుల్లో వాటిని పెంచి అమ్ముతున్నాడు. సోమవారం ఉదయం నిద్రలేచి పావురాలకు మేత వేసేందుకు మేడ మీదికి వెళ్ళగా.. అక్కడ అన్ని బోనులు ఖాళీగా కనిపించడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. అన్నేసి పావురాలు చిన్న శబ్దం కూడా రాకుండా ఏలా దొంగలించి ఉంటారని నోటమాట రాకుండా ఉండిపోయాడు. తేరుకొని వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దొంగలను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. కాగా, వందలాది పావురాల చోరీతో వాటిని ఉంచే బోనులు ఖాళీగా కనిపించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






