- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మన దగ్గర ఉచితంగా దొరికే జోలా.. న్యూయార్క్‌లో లగ్జరీ ఐటెంగా మారింది!
ఫ్యాషన్ (Fassion) ప్రపంచంలో ఎన్నో రకాలైన డిజైన్లు, మోడల్స్ నిత్యం చూస్తుంటాం.

దిశ, వెబ్ డెస్క్: ఫ్యాషన్ (Fassion) ప్రపంచంలో ఎన్నో రకాలైన డిజైన్లు, మోడల్స్ నిత్యం చూస్తుంటాం. అయితే, తాజాగా ఓ బ్యాగు డిజైన్, దాని ధరపై నెట్టింట విపరీతంగా చర్చ నడుస్తోంది. ఎందుకంటే.. ఆ బ్యాగును మన దేశంలో చీప్‌గా చూస్తుంటాం. కిరణా వస్తువులు, మార్కెట్‌లో కూరగాయలకు, ప్రయాణాల్లో స్నాక్స్ వంటివి పెట్టుకోడానికి వాడుతుంటాం. అలాంటి బట్టతో తయారుచేసే జోలా (Jhola) బ్యాగు ఇప్పుడు లగ్జరీ వస్తువుగా మారింది. మార్కెట్‌లో రూ.50 నుంచి రూ.100 దొరికే ఈ బ్యాగు ధర ఏకంగా రూ.4000లకు చేరింది. మీరు కూడా షాక్ అవుతున్నారా? అయితే, ఈ ధర మన దగ్గర కాదులేండి. అమెరికాకు చెందిన లగ్జరీ స్టోర్ నార్డ్‌స్ట్రోమ్ (Nordstrom) వెబ్‌సైట్‌లో ఈ బ్యాగు ధర 48 డాలర్లుగా ఉంది. అంటే మన కరెన్సీలో రూ.4,228.
జపనీస్ బ్రాండ్ ప్యూబ్కో (Puebco) ఈ జోలాను 'ఇండియన్ సావనీర్ బ్యాగ్'గా (Indian Souvenir Bag) పేరు మార్చింది. ఇక డిజైన్ విషయానికొస్తే, ప్రాథమిక తెల్లటి కాటన్ బ్యాగ్‌పై 'రమేష్ స్పెషల్ నామ్‌కీన్', 'చేతక్ స్వీట్స్' వంటి హిందీ టెక్ట్స్ ఉంది. ఇక ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై భారతీయులు రకరకాలుగా చర్చిస్తున్నారు.. 'ఇలాంటివి మా ఇంట్లో పది ఉన్నాయ్. అమ్మకానికి పెట్టాలా?' అంటూ కొందరు, 'జోలా మాఫియా? విదేశీ బ్రాండ్లు మన సంస్కృతిని ఎలా వ్యాపారంగా మార్చుతున్నాయో చూడండి!' అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఇలా మన దగ్గర చాలా సాధారణమై వస్తువులను విదేశాల్లో లగ్జరీ వస్తువులుగా విక్రయిచటం ఇది మొదటిసారి కాదు. గతంలో బాలెన్సియాగా వంటి లగ్జరీ బ్రాండ్లు భారతీయ థైలాలతో పోలిక కలిగిన బ్యాగ్‌లను రూ.1.5 లక్షల ధరకు విక్రయించి, భారతీయుల మధ్య నవ్వులపాలయ్యాయి.






