- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీడియో కోసం వెళ్లి తిరిగిరాని యూట్యూబర్.. ఏం జరిగిందో మీరే చూడండి!
ప్రస్తుత యువత సోషల్ మీడియాలోనే జీవిస్తోందనటంలో అతిశయోక్తి లేదు.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత యువత సోషల్ మీడియాలోనే (Social Media) జీవిస్తోందనటంలో అతిశయోక్తి లేదు. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సమయం దొరికినప్పుడల్లా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్‌లోనే కాలం గడిపేస్తున్నారు. ఇక కొంతమంది ఎలాగైనా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని ప్రమాదకరమైన రీల్స్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటుంటే.. మరి కొందరు యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో కోసం ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒడిశాలోని (Odisha) కోరాపుట్ జిల్లాలో చోటుచేసుకుంది. సాగర్ తుడు (27) అనే యూట్యూబర్ స్నేహితులతో కలిసి డుడుమా జలపాతం వద్దకు వెళ్లాడు. అక్కడ ప్రకృతి అందాలను చిత్రీకరించి తన యూట్యూబ్ ఛానల్‌లో పెట్టాలనుకున్నాడు.
వీడియోను ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా తీసేందుకు ప్రయత్నిస్తూ, కెమెరాను స్నేహితులకు ఇచ్చి తాను నీటిలోకి దిగాడు. అయితే, మచ్కుంద్ ఆనకట్ట నుంచి అకస్మాత్తుగా నీరు విడుదల కావడంతో జలపాతంలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. సాగర్ నీటిలో చిక్కుకుపోయాడు. అతడిని కాపాడేందుకు స్నేహితులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సాగర్ చూస్తుండగానే వారి కళ్ల ముందే కొట్టుకుపోయాడు. దీంతో స్నేహితులు షాక్‌లో కన్నీటిపర్యంతమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. కానీ సాగర్ ఆచూకీ లభించలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఇది రెండు నెలల్లో డుడుమా జలపాతంలో జరిగిన రెండవ ఘటన కావటం గమనార్హం.






