3 కోట్ల విలువైన లంబోర్ఘిని కారును క్షణాల్లో ధ్వంసం చేసిన యూట్యూబర్ (వీడియో)

by Disha Web Desk 12 |
3 కోట్ల విలువైన లంబోర్ఘిని కారును క్షణాల్లో ధ్వంసం చేసిన యూట్యూబర్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ యూట్యూబర్ విచిత్రమైన మార్కెటింగ్ స్టంట్‌లో భాగంగా అత్యంత ఖరీదైన కారులలో ఒకటైన లంబోర్ఘినిని నాశనం చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఆ వీడియోకు 7 మిలియన్ల వ్యూస్, అలాగే 7 లక్షల కంటే ఎక్కువ లైక్స్ వచ్చాయి. కాగా ఆ వీడియోలో రష్యాకు చెందిన యూట్యూబర్ మిఖాయిల్ లిట్విన్ వింతైన స్టాంట్స్ చేయడంలో ఎంతో పేరు పొందాడు. ఇందులో భాగంగా అత్యంత ఖరీదైన లంబోర్ఘిని ఉరుస్ SUV పై భారీ క్రేయిన్ సాయంతో బరువైన వస్తువును పడేశాడు. దీంతో ఆ లంబోర్ఘిని ఉరుస్ SUV చూస్తుండగానే పూర్తిగా ధ్వంసం అయింది. ఈ యూట్యూబర్‌కు సోషల్ మీడియాలో సుమారు. 10 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.

ఇవి కూడా చదవండి : 70 కేజీల బంగారు ఇటుకలతో వధువుకి తులాభారం (వీడియో)

Also Read..

వధువుకు కట్నం ఇచ్చే ఆచారం.. డబ్బులు లేక ఒంటరవుతున్న యువకులు


Next Story

Most Viewed