- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సారీ చెబుతూ శాపం పెట్టిన నా అన్వేషణ.. మరో షాకింగ్ వీడియో విడుదల
సారీ చెబుతూ శాపం పెట్టిన నా అన్వేషణ.. మరో షాకింగ్ వీడియో విడుదల

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహా రావుకు, నటుడు శివాజీకి యూట్యూబర్ నా అన్వేషణ(Naa Anveshana) క్షమాపణ చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు. ‘నాదే తప్పు.. పొరపాటు కొన్ని పదాలు దొర్లాయి. అందుకే వినాయకుడి సమక్షంలో సారీ చెబుతున్నా. నా క్షమాపణను స్వీకరించాలి.. లేకపోతే వచ్చే నూతన సంవత్సరంలో నన్ను టార్గెట్ చేసే అందరికీ అష్ట దరిద్రాలు అంటుకుంటాయి. నా నాలుకమీద మచ్చలు ఉన్నాయి. నేను ఏది చెబితే అది జరుగుద్ది. అందుకే నా సారీని స్వీకరించండి’ అని నా అన్వేషణ వీడియోలో పేర్కొన్నారు. కాగా, నటుడు శివాజీ(Actor Shivaji), గరికపాటి నరసింహా రావు(Garikipati Narasimha Rao), హిందూ దేవతలపై యూట్యూబర్ నా అన్వేషణ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో చాలామంది ఆయనపై కోపంతో రగిలిపోయారు. నెటిజన్స్ అన్‌ఫాలో చేయడం, రిపోర్టులు కొడుతుండటంతో సారీ చెబుతూ వీడియో వదిలారు. రామాయణం, మహాభారతం గురించి కూడా నా అన్వేషణ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే నా అన్వేషణ యూట్యూబర్‌ను ఇండియాకు రప్పించి కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు పోలీసులను డిమాండ్ చేస్తున్నాయి.






