- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mahakumbh Mela:అఘోరతో ప్రేమలో పడిన యువతి.. తానే నా భర్త అంటూ పోస్ట్?(వీడియో వైరల్)
ఉత్తరప్రదేశ్(Uttarapradesh)లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో జరుగుతున్న మహాకుంభమేళా కోలాహలంగా కొనసాగుతుంది.

దిశ,వెబ్‌డెస్క్:ఉత్తరప్రదేశ్(Uttarapradesh)లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో జరుగుతున్న మహాకుంభమేళా కోలాహలంగా కొనసాగుతుంది. ఈ మహాకుంభమేళా(Mahakumbh Mela)కు ఎక్కడెక్కడి నుంచో అధిక సంఖ్యలో భక్తులు(Devotees) తరలి వస్తున్నారు. ఈ తరుణంలో త్రివేణి సంగమంలో తలస్నానం చేసి పాపాలు పోగొట్టుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వృద్ధులు, మహిళలు, సాధువులు, సన్యాసులు వస్తున్నారు. ఐఐటీ బాబా, కండల బాబా వంటి వార్తలు వైరల్ అయ్యాయి.
ఇక ఈ మహాకుంభమేళా(Mahakumbh Mela)లో పలు ఆసక్తికర సంఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. అయితే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పలువురు భక్తులు తమ వింత వింత చేష్టలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఓ అఘోరా(Aghora), ఓ యువతి ప్రేమకథ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అసలు విషయంలోకి వెళితే.. రష్యాకు చెందిన ఓ మహిళా ప్రయోగరాజ్‌లో జరుగుతునున్న కుంభమేళాకు వచ్చింది.
ఈ క్రమంలో ఆమె ఓ అఘోరీ బాబా(Aghori Baba)తో ప్రేమలో పడి, తన దేశాన్ని విడిచి భారతదేశం(India)లోనే స్థిరపడిపోయింది. ఇప్పుడు ఆమె అఘోరి బాబాను తన భర్తగా ప్రకటిస్తున్నట్లు ఓ వీడియోలో కనిపిస్తోంది. అయితే పలువురు అఘోరి బాబాను.. ‘ఆమె రష్యన్ కారణంగా మీ తపస్సుకు ఎప్పుడైనా అంతరాయం కలిగిందా?’ అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా బాబా చిన్న చిరునవ్వు నవ్వారు. అయితే ప్రేమ(Love) అనేది ఎప్పుడు ఎవరితో ఎలా మొదలవుతుందో చెప్పలేం అనడానికి ఇది ఒక నిదర్శనంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారుతోంది.






