‘ఇంత ఆలస్యంగా తీసుకొస్తావా?’.. క్యాబ్ డ్రైవర్‌ను చితకబాదిన మహిళ(వీడియో వైరల్)

by Jakkula.Mamatha |   (  Updated:2025-01-29 13:08:26  IST  )

ముంబ‌యి(Mumbai) విమానాశ్ర‌యం(Mumbai Airport)లో ఇటీవ‌ల షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది.

‘ఇంత ఆలస్యంగా తీసుకొస్తావా?’.. క్యాబ్ డ్రైవర్‌ను చితకబాదిన మహిళ(వీడియో వైరల్)
X

దిశ,వెబ్‌డెస్క్: ముంబ‌యి(Mumbai) విమానాశ్ర‌యం(Mumbai Airport)లో ఇటీవ‌ల షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ మ‌హిళ క్యాబ్ డ్రైవ‌ర్‌(Cab Driver)ను దుర్భాష‌లాడుతూ చిత‌క‌బాదింది. ఎయిర్‌పోర్టు(AirPort)కు ఆల‌స్యంగా తీసుకురావ‌డంతో విమానం మిస్స‌యింద‌ని ఆరోపిస్తూ క్యాబ్ డ్రైవ‌ర్‌పై దాడి(attack)కి పాల్ప‌డినట్లు తెలుస్తోంది. ఈ విధంగా ఆమె దాడికి పాల్పడడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇందులో డ్రైవ‌ర్(Driver) త‌ప్పు ఏమీ లేద‌ని ఆ మ‌హిళే ఆల‌స్యంగా ఇంటి నుంచి బ‌య‌లుదేరిన‌ట్లు స‌మాచారం. దీంతో స‌ద‌రు మ‌హిళ‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ముంబ‌యి(Mumbai) ట్రాఫిక్ పోలీసుల‌(Traffic Police)ను కోరారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media)లో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ మహిళ పై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో బాధిత క్యాబ్ డ్రైవ‌ర్ వెంట‌నే స‌మీప పోలీస్ స్టేష‌న్‌(Police Station)కు వెళ్లి ఫిర్యాదు చేయాల‌ని నెటిజ‌న్లు సూచించారు.

Next Story