- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Video: రైల్వే ప్రయాణంలో మనకు తోడుండే వాయిస్ ఈమెదే !
కింది వీడియోలో ఉన్న ఆ లేడీ, వయసు దాదాపు 35 సంవత్సరాలు ఉన్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: రైల్వే స్టేషన్లలో నిత్యం ప్రయాణికుల సందడి ఉంటుంది. అనౌన్స్ మెంట్స్, రైల్వే కూతలు, ప్రయాణికుల సందడి రైల్వేస్టేషన్ లలో మనం చూస్తూ ఉంటాం. అలాగే రైళ్లు ఆలస్యం వస్తున్నాయని.. ఫలానా ఫ్లాట్ ఫామ్ లోకి ట్రైన్ వచ్చిందని రైల్వే శాఖ సిబ్బంది నిత్యం అప్డేట్ చేస్తూనే ఉంటుంది. మైక్ లో వాళ్ల వాయిస్ మనం నిత్యం వింటుంటాం.
ముఖ్యంగా రైల్వే స్టేషన్లలలో ప్రయాణికులకు విజ్ఞప్తి అంటూ మనకు ఎప్పుడూ ఒక లేడీ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. గతంలో సరళ చౌదరి అనే లేడీ రైల్వే స్టేషన్లలో వాయిస్ ఇచ్చేది. అయితే ఇప్పుడు మరో మహిళ వాయిస్ వైరల్ గా మారింది. ప్రతి రైల్వే స్టేషన్లలలో సరళ చౌదరి తరహాలోనే మాట్లాడే మహిళ ఈమెనే అంటూ వీడియోలు వైరల్ చేస్తున్నారు నెటిజన్స్.
కింది వీడియోలో ఉన్న ఆ లేడీ, వయసు దాదాపు 35 సంవత్సరాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈమె పేరు గీతాంజలి శర్మ అని సమాచారం. దీంతో ఇన్నేళ్లుగా తాము వింటున్నది ఈ లేడీ గొంతునేనా అంటూ షాక్ అవుతున్నారు నెటిజెన్స్. కాగా తెలుగు రాష్ట్రాల్లో ఈమె వాయిస్ వాడకం తక్కువని సమాచారం. నార్త్ రాష్ట్రాలలో ఎక్కువగా ఈమె వాయిస్ వాడతారట.






