‘‘కులాన్ని మతాన్ని కాదు మానవత్వాన్ని నమ్మండి’’ అంటూ వైరల్ అవుతున్న పెళ్లి కార్డు

by Disha Web Desk 7 |
‘‘కులాన్ని మతాన్ని కాదు మానవత్వాన్ని నమ్మండి’’ అంటూ వైరల్ అవుతున్న పెళ్లి కార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి పతిక్రలు అనేవి ఎవరి మతానికి సమేతంగా వాళ్లు ఆ దేవుని ఫొటోలతో చిత్రీకరించుకుంటారు. కానీ, మానవత్వాన్ని నమ్మండి మతాన్ని కాదు అంటూ.. ఓ వ్యక్తి వినూత్నంగా వెడ్డింగ్ కార్డు కొట్టించాడు. ఆ వివరాల్లోకి వెళితే.. ప్రభు కుమార్ సౌజన్య గౌడ్ అనే వ్యక్తి గురువారం వివాహం చేసుకున్నాడు. అతని వివాహానికి స్వాగతించేందుకు పెళ్లి కార్డును తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూలలో ముద్రించి మూడు మతాలకు చెందిన దేవుళ్ళ ఫొటోలు కూడా కార్డుపై ప్రింట్ చేయించాడు.

అంతే కాకుండా మానవులందరూ ఒక్కటేనని కులము, మతము కాదని చాటి చెబుతూ ఆయన పెళ్లి కార్డు కొట్టించి విహహం చేసుకోవడంతో పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఒక నూతన సంప్రదాయానికి పునాది వేస్తూ మానవత్వానికి పెద్ద పీట వేసి మీరు తీసుకున్న ఈ నిర్ణయానికి భవిష్యత్తులో మరింత మంది కులాన్ని మతాన్ని కాకుండా మానవత్వాన్ని నమ్మి ఒక ఆదర్శ సమాజం కోసం కృషి చేస్తామని పలువురు చర్చించుకోవడం గమనించదగ్గ విషయం. బంధువులు, మిత్రులు, పుర ప్రముఖులు అధిక సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించి మంచి విందు భోజనం ఆరగించారు.

Also Read..

వరెవ్వా.. వెరైటీ వెడ్డింగ్ కార్డ్


Next Story