- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లవ్ మ్యారేజ్ చేసుకున్నారో.. ఇక మీ సంగతి చూస్తాం..! యువతకు ఆ గ్రామస్తుల హెచ్చరిక..
లవ్ మ్యారేజ్ చేసుకున్నారో.. ఇక మీ సంగతి చూస్తాం..! యువతకు ఆ గ్రామస్తుల హెచ్చరిక..

దిశ, ఫీచర్స్ : ప్రేమ వివాహమైనా.. పెద్దలు కుదర్చిన పెళ్లైనా.. ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించాలనేదే దాని పరమార్థం. అరైంజ్డ్ మ్యారేజ్‌లో అప్పటి వరకు పరిచయం లేని వ్యక్తితో కలిసి జీవించడానికి పెద్దల సహకారంతో సిద్ధ పడితే.. లవ్ మ్యారేజ్‌లో ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకొని జీవితాంతం కలిసుండాలని డిసైడ్ అవుతారు. లీగల్ ఏజ్ అయినప్పుడు ఇక్కడ కూడా పెద్దలు అంగీకరిస్తే ప్రాబ్లం ఉండదు. కానీ ప్రేమ పెళ్లిళ్ల విషయానికి వచ్చేసరికి చాలామంది అలా చేయరు. ఆధునిక కాలంలోనూ పితృస్వామిక భావజాలమే రాజ్యమేలుతోంది. అవగాహనా రాహిత్యం, సామాజిక స్పృహలేకపోవడం, అహంకారభావం ఇందుకు ప్రధాన కారణంగా నిపుణులు పేర్కొంటుంటారు. అచ్చం అలాంటి సంఘటనకు సంబంధించి న్యూస్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వైరల్ సమాచారం (Viral news) ప్రకారం.. పంజాబ్‌లోని మొహాలీ జిల్లాలోగల మానక్ పూర్ షరీఫ్ అనే గ్రామానికి చెందిన ప్రజలు, యువతీ యువకులు లవ్ మ్యారేజ్ చేసుకోవడాన్ని ఆ గ్రామ పెద్దలు నిషేధించారు. జులై 31, 2025న ఆ గ్రామ పంచాయతీలోనూ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. కుటుంబం అనుమతి లేకుండా ప్రేమ వివాహం చేసుకోవడాన్ని సహించేది లేదని, అలా చేసిన వారికి గ్రామంలో, సమీపం ప్రాంతంలో నివసించడానికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రేమ వివాహం చేసుకున్న వారికి, వారికి సపోర్ట్ చేసేవారికి, ఆశ్రయం ఇచ్చేవారికి కూడా తగిన శిక్ష తప్పదని హెచ్చరించారు.
అయితే సాంప్రదాయాలు, సామాజిక సామరస్యాన్ని కాపాడేందుకే తమ గ్రామస్తులకు ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడాన్ని నిషేధించినట్లు మానక్ పూర్ షరీఫ్ (Manakpur Sharif) గ్రామ సర్పంచ్ దల్వీందర్ సింగ్ సమర్థించుకున్నాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆధునిక కాలంలోనూ ఆటవిక చర్యలేంటని, అనాగరిక నిర్ణయాలు తగదని పలువురు పేర్కొంటున్నారు. ప్రేమ వివాహాలు తప్పేం కాదని అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ ఘటనపై స్పందించిన మొహాలీ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ (రూరల్) సోనమ్ చౌదరి ప్రేమ వివాహాల నిషేధం గురించి తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని, వస్తే తప్పక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. Link






