గజ గజ వణుకుతున్న గ్రామం.. గాల్లో తేలుతున్న పొలంలో నాటిన దిష్టిబొమ్మ!

by Jakkula Samataha |

పొలంలో దిష్టి బొమ్మ పెట్టడం అనేది చాలా కామన్. రైతులు కష్టపడి ధాన్యం పండిస్తారు. అయితే అవి విత్తనాలుగా మారే సమయంలో కొన్ని పక్షులు లేదా జంతువులు పొలంలో పడి పంటను నాశనం చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.

గజ గజ వణుకుతున్న గ్రామం.. గాల్లో తేలుతున్న పొలంలో నాటిన దిష్టిబొమ్మ!
X

దిశ, ఫీచర్స్ : పొలంలో దిష్టి బొమ్మ పెట్టడం అనేది చాలా కామన్. రైతులు కష్టపడి ధాన్యం పండిస్తారు. అయితే అవి విత్తనాలుగా మారే సమయంలో కొన్ని పక్షులు లేదా జంతువులు పొలంలో పడి పంటను నాశనం చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వాటి నుంచి తమ పంటను కాపాడుకోవడానికి రైతులు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కొత్త కొత్తగా ఆలోచిస్తారు. కొందరు పొలంలో దిష్టి బొమ్మను పెడితే మరి కొందరు కరెంట్ సహాయంతో సౌండ్ అయ్యే విధంగా డబ్బు సౌండ్ మ్యూజిక్ పెడుతుంటారు.

అయితే ఓ రైతు తన పంట పొలాన్ని కాపాడుకోవడానికి చేసిన ఓ కొత్త ఆలోచన గ్రామాన్నే వణికిస్తుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా, అసలు విషయంలోకి వెళితే.. రైతు పొలంలో దిష్టి బొమ్మను తయారు చేసి పెట్టాడు. కాకపోతే దానికి కాస్త ట్రెండీ బట్టలు వేసి, దానికి స్ప్రింగ్ కూడా అమర్చాడు. ఇది స్ప్రింగ్ సహాయంతో ఊగుతూ కనిపిస్తుంది. దీంతో దానిని దూరం నుంచి చూస్తే ఓ స్త్రీ గాలిలో ఎగిరినట్లు కనిపిస్తుంది. ఇక దీనిని నైట్ టైమ్ చూసిన గ్రామస్తులు అక్కడ ఏదో ఉందని తెగ భయపడిపోతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Next Story