రెండు పెళ్లిళ్లు చేసుకుంటా.. పోలీసుల ముందే రచ్చ చేస్తున్న ఓ యువతి వీడియో వైరల్..

by Disha Web Desk 9 |
రెండు పెళ్లిళ్లు చేసుకుంటా.. పోలీసుల ముందే రచ్చ చేస్తున్న ఓ యువతి వీడియో వైరల్..
X

దిశ, వెబ్‌డెస్క్: వివాహం అయిన వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మరో పెళ్లి చేసుకుంటాను అంటూ ఓ యువతి పోలీసుల ముందు వీరంగం సృష్టించింది. విషయం ఏంటంటే... అప్పుడే పెళ్లి చేసుకున్న యువతి మళ్లీ పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఇటూ వరుడు, అటూ వధువు రెండు కుటుంబాలు, బంధువులందరూ షాక్‌కు గురయ్యారు. వివాహం అనంతరం ఆ నూతన వధువు పోలీసుల వద్దకు వెళ్లి.. ‘‘నాకు ఇప్పుడు నా ప్రేమికుడు కావాలి, అతడిని కూడా పెళ్లి చేసుకుంటాను నాకు ఇద్దరు కావాలి అంటూ డిమాండ్ చేసింది. ఆమె ఆ విధంగా ప్రవర్తించడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆ యువతి స్టేషన్ వద్ద ఎవరితోనో గొడవ పడుతుంటే ఇద్దరు మహిళ పోలీసు ఆఫీసర్లు ఆమెను పట్టుకున్నారు. అయినా ఆమె ఆగకపోవడంతో కింద పడేసే ప్రయత్నం చేశారు. ఇంతలో ఆమె ఫోన్‌ను నేలకేసి కొట్టింది. తర్వాత కొంత సమయానికి మళ్లీ పైకి లేచి గందరగోళం చేసింది. ఎలాగైనా రెండు పెళ్లిళ్లు చేసుకుంటాను అంటూ గట్టిగా కేకలు పెట్టింది.

ఈ సంఘటనపై నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. కొందరేమో.. ఆ వధువుకు బలవంతపు పెళ్లి చేసినట్టుగా, మరికొందరు అవును అందుకే తన లవర్‌ను పెళ్లి చేసుకుంటానని చేసి ఉంటుందని, కాగా, ఇంకొంతమంది ఆమె ప్రవర్తనను బాగా లేదు అని అన్నారు. అమ్మాయి, అబ్బాయికి ఇష్టం లేకుండా తాము చూసిన వాళ్లనే వివాహం చేసుకోవాలని ఎందుకు బలవంతం చేస్తారో అర్థం కాదని ఒక నెటిజన్ పేర్కొన్నాడు. అందువల్లనే వధువు, వరుడు, మాజీ లవర్ కుటుంబాలకు తలనొప్పిగా మారుతుందని చెప్పాడు. మరొకరు ఇది చాలా బాధాకరమైన ఘటన అని, ఆమెకు ఎందుకు బలవంతపు పెళ్లి చేశారని, ఈ డ్రామా అంతా పెళ్లికి ముందు చేయాల్సిందని, మరొకరు వరుడికి ఏ ప్రమేయం లేకున్నా ఈ అవమాన భారాన్ని మోయాల్సి వస్తుందని తెలిపాడు. వారు పెళ్లి కూతురు కుటుంబంపై ఫ్రాడ్ కేసు పెట్టాలని కోపాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు ఇంకా తెలియరాలేదు.

Next Story

Most Viewed