- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గర్ల్‌ఫ్రెండ్‌తో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన కొడుకు.. తల్లి చేసిన పనికి అంతా షాక్!
కన్న కొడుకు ప్రియురాలితో షికారు చేస్తూ దొరికిపోతే.. ఏ తల్లి అయినా ఏం చేస్తుంది? పచ్చిబూతులు తిడుతుంది.

దిశ, వెబ్‌డెస్క్: కన్న కొడుకు ప్రియురాలితో షికారు చేస్తూ దొరికిపోతే.. ఏ తల్లి అయినా ఏం చేస్తుంది? పచ్చిబూతులు తిడుతుంది. లేదంటే ఇంటికి వచ్చాక కాళ్లు విరగ్గొట్టి కూర్చోబెట్టి చివాట్లు పెడుతుంది. కానీ, రూటీన్‌కు భిన్నంగా ఓ తల్లి చేసిన పని నెటిజెన్లను షాకింగ్‌కు గురి చేస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మెట్రో స్టేషన్‌లో ప్రేమికులిద్దరూ ఓ పిట్టగోడపై కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలోనే అబ్బాయి తల్లిదండ్రులు అక్కడికి రాగా.. వారిద్దరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ప్రియురాలితో కొడుకును చూసిన తల్లి ఏమాత్రం కోపగించుకోకుండా, వెంటనే తన వద్ద ఉన్న పళ్లు, స్వీట్లతో ఆ యువతికి స్పాట్‌లోనే బొట్టు పెట్టి తన ఇంటి కోడలిగా ఆహ్వానించింది. అనంతరం ప్రేమికులిద్దరూ వారి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఈ చిత్రం చూసిన స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇక నెట్టింట్లో ఈ వీడియో చూసిన నెటిజెన్లు.. ‘ఇది కదా జనరేషన్ గ్యాప్ తగ్గడం అంటే..! ఆ అబ్బాయి చాలా అదృష్టవంతుడు’, ‘ఆ అత్తగారి సానుకూల దృక్పథానికి హ్యాట్సాఫ్.. అనవసరమైన గొడవలు లేకుండా విషయాన్ని సింపుల్‌గా తేల్చేశారు’ అంటూ కామెంట్ చేస్తున్నారు.






