- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆకాశం నవ్వుతుంది.. మరీ అస్సలు మిస్సవ్వకండి
సాధారణంగా ఆకాశం నీలి రంగు పూసుకుని నిర్మలంగా, ప్రశాంతంగా కనిపిస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా ఆకాశం నీలి రంగు పూసుకుని నిర్మలంగా, ప్రశాంతంగా కనిపిస్తుంది. అయితే ఇది అప్పుడప్పుడూ మేఘాలు ముసుగు తొడిగి, ఉరుముల గర్జనలతో భయానకంగా మారుతుంది. ఇలాంటి దృశ్యం చూసినప్పడు ఆకాశానికి కోపం వచ్చిందా అని కూడా అనుకుంటాం. ఈ వాతావరణ పరిస్థితులు మనం నిత్యం ఆకాశంలో చూస్తునే ఉంటాం. కానీ, ఆకాశం నవ్వితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా? ఆకాశం తన రెండు కళ్లతో చూస్తూ.. బోసి నవ్వుతో మిమ్మల్ని పలకరిస్తే ఎలా ఉంటుంది.. అద్భుతం కదా! అయితే, ఇవాళే ఈ అరుదైన అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది.
అంతరిక్షంలో ఎన్నో అద్భుతాలు దాగి ఉంటాయి. సూర్యుడు, చంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు, ఉల్కాలు.. అన్నీ విశ్వంలో భాగమే. ఇక సూర్యుడి చుట్టూ గ్రహాలు ఒక కక్ష్యలో తిరుగుతాయని మనకు తెలుసు. ఈ క్రమంలో అప్పుడప్పుడూ అవి భూమి దగ్గరగా వస్తుంటాయి. ఈ సమయంలో ఆకాశంలో అరుదైన దృశ్యాలు ఆవిష్కృతమవుతుంటాయి. గతంలో కూడా ఇలాంటి ఖగోళ దృగ్విషయాలు అనేకం సంభవించాయి. ఈరోజు (ఏప్రిల్ 25) కూడా ఇలాంటి అద్భుత దృశ్యం జరుగనుంది. శుక్రుడు, శని గ్రహాలు చంద్రుడికి అత్యంత సమీపంలోకి రానున్నాయి. అయితే, ఇవాళ చంద్రుడు నెలవంక రూపంలో దర్శనమిస్తుండటంతో త్రిభుజాకారంలో ఈ మూడు అమరి ఆనందానికి ప్రతిబింబం అయిన స్మైలీ ఇమేజ్ల రూపంలో కనిపించనున్నాయి. దీనిని ట్రిపుల్ కంజక్షన్ అంటారు. అంటే.. భూమిపై ఒక పాయింట్ నుంచి ఆకాశంలో మూడు వస్తువులు ఒకదానికొకటి దగ్గరగా కన్పిస్తాయి.
మన కళ్లతో నేరుగా దీన్ని చూడొచ్చని, టెలిస్కోప్, బైనాక్యులర్లతో మరింత క్లారిటీగా కనిపిస్తుందని వెల్లడించింది. మీరు దీన్ని కంటితో చూడవచ్చు. అదనంగా, మెరుగైన వీక్షణ కోసం టెలిస్కోప్ లేదా బైనాక్యులర్లతో చూడవచ్చు. ఇక దీనికి ముందు, 2008లో శుక్రుడు, బృహస్పతి, చంద్రుడు కలిసి కనిపించినప్పుడు ఇలాంటి దృశ్యం ఆకాశంలో కనిపించింది.






