- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమ్ముడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న అక్క.. ఆపై తల్లి, చిన్నమ్మపై కేసు (వీడియో)

దిశ, వెబ్‌డెస్క్ : సభ్యసమాజం తలదించుకునేలా, అన్నాచెల్లెలు బంధానికి మచ్చతెచ్చేలా వ్యవహరించారు ఈ ఇద్దరు అక్కా తమ్ముడు. వరుసకు తమ్ముడయ్యే యువకుడిని ఓ యువతి ప్రేమించి, పెద్దలను ఎదిరించి వివాహం చేసుకోవడం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కర్ణాటకలోని బెంగళూరు రూరల్ జిల్లాలో జరిగిన ఈ జుగుప్సాకర సంఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. దేవనహళ్లికి చెందిన శశికళకు హోసకోటలో నివసించే తన పెద్దమ్మ కుమారుడు ప్రవీణ్‌తో మంచి అనుబంధం ఉంది. కాలక్రమేణా అది కాస్తా ప్రేమగా మారింది. అయితే, వీరిద్దరూ రక్తసంబంధీకులు (వరుసకు అక్కాతమ్ముళ్లు) కావడంతో వీరి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించలేదు. శశికళ, ప్రవీణ్ తల్లులు ఇద్దరు అక్కాచెల్లెల్లు కావడంతో గమనార్హం.
నిశ్చితార్థం వేళ ఉత్కంఠ
ఈ క్రమంలో శశికళ తల్లిదండ్రులు ఆమెకు వేరే వ్యక్తితో సంబంధం ఖాయం చేసి, పెళ్లికి ముహూర్తం నిశ్చయించారు. శుభలేఖలు పంచిపెట్టి పెళ్లికి బంధుమిత్రులను ఆహ్వానించారు. అయితే అమ్మ, చిన్నమ్మ తమ ప్రేమకు అడ్డుకట్ట వేస్తున్నారని భావించిన శశికళ, ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా పారిపోయింది. అనంతరం ప్రవీణ్, శశికళ రహస్యంగా స్థానిక అంగట్ట ప్రాంతంలోని ఒక శివాలయంలో ఇద్దరూ సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. వివాహం అనంతరం తమ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని భయాందోళనకు గురైన ఈ జంట, రక్షణ కల్పించాలంటూ చిక్కబళ్లాపూర్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని రక్షణ కోరారు. ‘మేము ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం.. మా తల్లిదండ్రుల నుంచి మాకు ముప్పు పొంచి ఉంది, దయచేసి మాకు భద్రత కల్పించండి’ అని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరు కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, వరుసకు అక్కాతమ్ములయ్యే వారు ఇలా పెళ్లి చేసుకోవడం పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






