- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెడ్రూమ్ లో భార్యతో పనోడు.. మోస్ట్ హిలేరియస్ ఇండియన్ యాడ్.. వీడియో వైరల్
సోషల్ మీడియా వచ్చాక అశ్లీలత విచ్చలవిడిగా పెరిగిపోయింది. పైగా ఏఐ టెక్నాలజీతో లేనిపోని సమస్యలు వచ్చి పడుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా వచ్చాక అశ్లీలత విచ్చలవిడిగా పెరిగిపోయింది. పైగా ఏఐ టెక్నాలజీతో లేనిపోని సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఇప్పుడు వస్తున్న వీడియోల్లో ఏది నిజం, ఏది ఏఐ క్రియేషన్ అని తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. దీనికంటే పాతరోజులో బాగున్నాయని అనుకుంటున్నారు ప్రజలు. నిజమే అప్పటి రోజులే బాగుండేవి. అప్పట్లో టీవీల్లో వచ్చే యాడ్స్ లో అశ్లీలత చూపించకుండా.. చాలా నీట్ గా ఉండేవి. అలాంటి ఒక యాడ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఆ యాడ్ లో భార్య భర్తలు బయటకి వెళ్లాల్సి ఉంటుంది. భార్య బెడ్రూమ్ లో డ్రస్ చేంజ్ చేసుకుని రెడీ అయి వచ్చేందుకు కాస్త సమయం పడుతుంది. ఈలోగా హాల్ లో వెయిట్ చేస్తున్న భర్త ఇంకెంతసేపు అంటూ చిరాకు పడతాడు. సరే బయటకి వచ్చాక ఇక బయల్దేరుదాం అనుకునేలోపే ఆ బెడ్రూమ్ లో నుంచి పనోడు కూడా వస్తాడు. నువ్వేం చేస్తున్నావురా లోపల అని అనుమానంగా అడుగుతాడు భర్త. లోపల దుమ్ముపడితే క్లీన్ చేస్తున్నా సర్ అంటాడు. కానీ గది చీకటిగా కనిపిస్తుంది. లోపలికి వెళ్లి చూస్తే.. గదిలో లైట్ ఉన్నా వెలుగు కనిపించదు. ఇంతకీ ఈ యాడ్ ఎందుకో తెలుసా? గదిలై లైట్ కోసం. Halonix అనే కంపెనీ బ్రైట్ లైట్స్ కోసం ఇచ్చిన యాడ్. ఇప్పుడు ఈ యాడ్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. ఎంత హిలేరియస్ గా ఉందోనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Read More..






