Goa: కొంప‌ముంచిన గూగుల్ మ్యాప్‌..విదేశీ మ‌హిళ‌ను కాపాడిన‌ రాపిడో డ్రైవర్

by velandi.Saikiran |

మ్యాప్ పెట్టుకొని వెళ్లిన ఆ విదేశీ మహిళ, దారితప్పిన నేపథ్యంలో ఓ ర్యాపిడో లేడీ డ్రైవర్ కాపాడిన సంఘటన గోవాలో చోటుచేసుకుంది.

Goa: కొంప‌ముంచిన గూగుల్ మ్యాప్‌..విదేశీ మ‌హిళ‌ను కాపాడిన‌ రాపిడో డ్రైవర్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: గూగుల్ మ్యాప్ నమ్ముకొని వెళ్లిన ఓ విదేశీ మహిళకు ఊహించని పరిణామం ఎదురైంది. మ్యాప్ పెట్టుకొని వెళ్లిన ఆ విదేశీ మహిళ, దారితప్పిన నేపథ్యంలో ఓ ర్యాపిడో లేడీ డ్రైవర్ కాపాడిన సంఘటన గోవాలో చోటుచేసుకుంది. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెద్ద నగరాలు లేదా తెలియని ప్రాంతాల్లో పర్యటించినప్పుడు చాలా మంది గూగుల్ మ్యాప్ పైన ఆధారపడతారు. 100కు 99% ఈ గూగుల్ మ్యాప్ సరిగ్గా పని చేస్తాయి. ఏదో ఒక సమయంలో మన దరిద్రం తాండవం చేస్తే, మాత్రం మన కొంప ముంచుతుంది ఈ గూగుల్ మ్యాప్. మనం పెట్టిన లోకేషన్ కాకుండా వేరే, ప్రాంతానికి తీసుకు వెళ్తూ ఉంటుంది. అలాంటి సంఘటనలు సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఎక్కువైన సంగతి తెలిసిందే.

విదేశీ మ‌హిళ‌ను కాపాడిన ర్యాపిడో డ్రైవ‌ర్

అయితే అచ్చం ఇలాంటి సంఘటనే గోవాలో మరోటి చోటు చేసుకుంది. గోవాకు విదేశీయులు విపరీతంగా వస్తారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓ విదేశీ మహిళ గోవాలో గూగుల్ మ్యాప్ ను నమ్ముకుని, తిరుగుతోంది. అయితే లేటెస్ట్ గా ఆమెకు ఆ గూగుల్ మ్యాప్ ఝ‌లక్ ఇచ్చింది. దీంతో ఆ విదేశీ మహిళ దారితప్పి అర్ధరాత్రి 10 గంటల సమయంలో గుర్తు తెలియని ప్రాంతంలో చిక్కుకు పోయింది. అలాంటి సమయంలో దేవతలాగా ఓ లేడీ ర్యాపిడో డ్రైవర్ ఎంట్రీ ఇచ్చింది.

ఆ విదేశీ మహిళ సమస్యను అర్థం చేసుకొని, ఆమెను గమ్యస్థానానికి తీసుకువెళ్లింది. ఆ విదేశీ మహిళకు సహాయం చేసింది సింధు కుమారి రాయ్ అనే లేడీ రాపిడో డ్రైవర్. ఇక తనకు సహాయం చేసినందుకుగాను సింధు కుమారికి స్పెషల్ థాంక్స్ చెప్పింది విదేశీ మహిళ. ఈ వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్ ఫిదా అయిపోతున్నారు. ఓ మహిళ అయి ఉండి, గుండె ధైర్యంతో విదేశీ మహిళను కాపాడిందని కామెంట్స్ చేస్తున్నారు.


Next Story