కారు నెంబర్‌కు కోసం కోట్లు ఖర్చు.. ఇండియాలోనే టాప్

by Gantepaka Srikanth |

కారు నెంబర్ కోసం కొందరు లక్షలు ఖర్చు చేయడం మనం ఇన్నాళ్లు చూశాం. ఇప్పుడది కోట్లకు చేరింది. ఓ వ్యక్తి నచ్చిన కారు నెంబర్ కోసం ఏకంగా కోటికి పైగా ఖర్చు చేశాడు.

కారు నెంబర్‌కు కోసం కోట్లు ఖర్చు.. ఇండియాలోనే టాప్
X

దిశ, వెబ్‌డెస్క్: కారు నెంబర్ కోసం కొందరు లక్షలు ఖర్చు చేయడం మనం ఇన్నాళ్లు చూశాం. ఇప్పుడది కోట్లకు చేరింది. ఓ వ్యక్తి నచ్చిన కారు నెంబర్ కోసం ఏకంగా కోటికి పైగా ఖర్చు చేశాడు. అందరిలో మనం స్పెషల్‌గా ఉండాలని కొందరు.. సంఖ్యాశాస్త్రం అనుసరించి సెంటిమెంట్‌తో మరికొందరు వీటి కోసం పెద్దమొత్తంలో చెల్లిస్తుంటారు. తాజాగా కారు నెంబర్ కోసం ఓ వ్యక్తి ఏకంగా రూ.1.17 కోట్లు ఖర్చు చేశాడు. HR88B8888 రిజిస్ట్రేషన్ నంబర్ కోసం అత్యధికంగా 45 మంది వాహనదారులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రారంభ ధరను రూ.50 వేలుగా నిర్ణయించారు. చివరకు ఇది రూ.1.17 కోట్లు పలికింది. అయితే, ఎవరు దీన్ని సొంతం చేసుకున్నారో తెలియాల్సి ఉంది. ఈ ఘటన హరియాణాలో చోటుచేసుకుంది. దీంతో ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన కారు రిజిస్ట్రేషన్‌ నంబర్‌గా నిలిచినట్లు సమాచారం. అయితే, దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటనేదీ విడుదల కాలేదు. గత వారం సైతం ‘HR22W2222’ రిజిస్ట్రేషన్ నంబర్ రూ.37.91 లక్షలు పలికడం విశేషం. కారు ఫొటో

Next Story