అజ్ఞాతంలోకి లాటరీ గెలిచిన వ్యక్తి.. కారణం ఇదే

by Ajay Maddhiboyina |

లాటరీ డబ్బు రావడంతో ఎవరైనా దొంగలిస్తారని భయపిడపోయిన కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఈ ఘ‌ట‌న పంజాబ్‌లోని ఫ‌రీద్ కోట్ జిల్లాలో చోటు చేసుకుంది.

అజ్ఞాతంలోకి లాటరీ గెలిచిన వ్యక్తి.. కారణం ఇదే
X

దిశ‌, వెబ్ డెస్క్: లాటరీ డబ్బు రావడంతో ఎవరైనా దొంగలిస్తారని భయపిడపోయిన కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఈ ఘ‌ట‌న పంజాబ్‌లోని ఫ‌రీద్ కోట్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని సైదేకే గ్రామానికి చెందిన నసీబ్ కౌర్, ఆమె భర్త రామ్ సింగ్ వ్యవసాయ కూలీలు. కాగా రామ్ సింగ్ ఇటీవల లాటరీలో రూ.1.5 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. డబ్బులు రావడంతో తమ కష్టాలు అన్నీ తీరిపోతాయని ఈ జంట భావించగా కొత్త కష్టాలు మొదలయ్యాయి.

వీరికి డబ్బు రావడంతో పాటు భయం కూడా మొదలైంది. తమ వద్ద ఉన్న డబ్బును ఎవరైనా దాడి చేసి దొంగలిస్తారని భావించిన జంట ఊరిని విడిచి ఎవ‌రికీ చెప్ప‌కుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఇంటికి తాళం వేసి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎవ‌రికీ క‌నిపించ‌కుండా పోయింది. అయితే విష‌యం పోలీసుల‌కు తెలియ‌డంతో వారు రామ్ సింగ్, న‌సీబ్ కౌర్ జాడ తెలుసుకుని తిరిగి ఊరికి రప్పించారు. వారికి ఎలాంటి అపాయం క‌ల‌గ‌కుండా చూసుకుంటామ‌ని హామీ ఇచ్చారు. దీంతో ఆ కుటుంబం తిరిగి ఇంటికి చేరుకుంది.

Next Story