లాలీపాప్ తో దొంగ మనసు మార్చిన చిన్నారి

by Muthe.Rajitha |

లాలీపాప్ ఇచ్చి దొంగమనసు మార్చిన ఓ చిన్నారి వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవువుతోంది.

లాలీపాప్ తో దొంగ మనసు మార్చిన చిన్నారి
X

దిశ, వెబ్ డెస్క్ : లాలీపాప్ ఇచ్చి దొంగమనసు మార్చిన ఓ చిన్నారి వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవువుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఒక షాపులో తండ్రీ, అతని రెండు మూడేళ్ళ పాప కూర్చొని ఉండగా.. అంతలో ఒక దొంగ అక్కడికి వచ్చి గన్ తో బెదిరిస్తాడు. భయపడిన తండ్రి షాపులోని డబ్బుతోపాటు, తన వద్ద ఉన్న డబ్బులు కూడా ఇస్తాడు. దీనిని గమనించిన ఆ చిన్నారి తన వద్ద ఉన్నవి కూడా ఇవ్వాలేమో అనుకొని, తన చేతిలో ఉన్న లాలీపాప్ ను తీసుకోమని చేయి చాపుతుంది.

దీంతో షాక్ అయిన దొంగ, చిన్నారి అమాయకత్వానికి కరిగి పోయి, షాపులో దోచుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాడు. గన్ జేబులో పెట్టి, ఆ పాపను ముద్దాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చిన్నారి అమాయక ప్రవర్తన దొంగను సైతం మార్చిందని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story