జూ నుంచి తప్పించుకున్న సింహం.. ఆ తరువాత జరిగింది ఇదే!

by Kema Shiva Kumar |

సాధారణంగా మనం జూకి వెళ్లినప్పుడు అక్కడున్న క్రూర మృగాలు చూసి భయంతో వణికిపోవడం సర్వసాధారణం.

జూ నుంచి తప్పించుకున్న సింహం.. ఆ తరువాత జరిగింది ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా మనం జూకి వెళ్లినప్పుడు అక్కడున్న క్రూర మృగాలు చూసి భయంతో వణికిపోవడం సర్వసాధారణం. ముఖ్యంగా సింహం ఉన్న బోను దగ్గరికి వెళ్లినప్పుడు అదిచూసే చూపు మనల్ని మింగేస్తుందా అన్నట్లుగా ఉంటుంది. కానీ, సింహమే జనవాసాల్లోకి వస్తే.. ఇంకేముంది రచ్చరచ్చే. అయితే, అచ్చం అలాంటి ఘటనే పోరుగు దేశం పాకిస్తాన్‌లో చోటుచేసుకుంది. లాహోర్ (Lahore) పట్టణం సమీపంలోని ఓ జూలో బోనులో ఉన్న సింహానికి ఆహారం వేస్తుండగా.. అది సిబ్బంది కళ్లుగప్పి బయటకు వచ్చేసింది. ఏకంగా గోడ దూకి రోడ్డుపైకి వచ్చి ఓ మహిళతో పాటు ఇద్దరు పిల్లలపై కూడా దాడి చేసింది. సింహాన్ని బంధించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేకపోవడంతో చివరకు దానిని తపాకీతో కాల్చి చంపారు. ప్రస్తుతం సింహం గోడ దూకి బయటకు వచ్చిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

వీడియో: https://x.com/bigtvtelugu/status/1941150912137007301

Next Story