- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లబుబు డాల్స్ ట్రెండ్.. సెలబ్రెటీలు కూడా ఫిదా అవుతున్న వీటి ప్రత్యేకత ఏంటంటే?
బార్బీ బొమ్మలు, సాఫ్ట్ టెడ్డీ బియర్ల కాలంపోయింది.. ఇప్పుడంతా లబుబు డాల్స్ ట్రెండ్స్ నడుస్తోంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఈ బొమ్మలను విపరీతంగా ఇష్టపడుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: బార్బీ బొమ్మలు, సాఫ్ట్ టెడ్డీ బియర్ల కాలంపోయింది.. ఇప్పుడంతా లబుబు డాల్స్ ట్రెండ్స్ నడుస్తోంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఈ బొమ్మలను విపరీతంగా ఇష్టపడుతున్నారు. సెలబ్రెటీలు సైతం లబుబు డాల్స్‌కు ఫిదా అయిపోతున్నారు. చూసేందుకు.. పెద్ద పెద్ద కన్నులు, పెదాల వెనుక పెద్ద పళ్ళు, కుందేలు చెవులు, అర్థంకాని ఎక్స్‌ప్రెషన్స్‌తో కొంచెం క్యూట్‌గా కొంచెం విచిత్రంగా ఉండే ఈ బొమ్మలకు ఒక్కసారిగా ఇంతా క్రేజ్ ఎందుకు వచ్చింది. సెలబ్రెటీలు సైతం ఇష్టపడేంతా ప్రత్యేకత ఏముంది? ఇక్కడ తెలుసుకుందాం.
లబుబు బొమ్మలు.. 2015లో వచ్చి 'ది మాన్‌స్టర్స్ (THE MONSTERS)' అనే సిరీస్‌లోని పాపులరైన విచిత్రమైన పాత్ర. దీనిని హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ చిత్రకారుడు, స్టోరీటెల్లర్ కాసింగ్ లంగ్ (Kasing Lung) రూపొందించారు. జానపద కథల నుంచి స్పూర్తి పొంది లంగ్ లబుబును సృష్టించారు. 2019లో లంగ్.. చైనీస్ బొమ్మల కంపెనీ పాప్ మార్ట్‌తో భాగస్వామ్యం చేసుకుని దీనిని మార్కెట్‌లోకి విడుదల చేశాడు. బ్యాగులు, కీచైన్‌లు.. మొదలైన ఎన్నో రూపాల్లో లబుబు బొమ్మలు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి.
ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే.. ఈ బొమ్మలను బ్లైండ్ బాక్స్‌లలో మాత్రమే విక్రయిస్తారు. అంటే.. కస్టమర్‌లు సీల్ చేసిన ప్యాకేజీలను కొనుగోలు చేస్తారు, లోపల ఏ బొమ్మ ఉందో వారికి తెలియదు. ఈ సస్పెన్స్ ఇంకా సర్ ప్రైజ్ కోసం కస్టమర్లు పోటీ పడి కొనుగోళ్లు చేయటం ప్రారంభించారు. వివిధ వెరియంట్లలో ఈ బొమ్మలు లభిస్తుండటంతో సెలబ్రెటీలు రిహానా, దువా లిపా, బ్లాక్‌పింక్ లిసా, అనన్య పాండే వంటి ప్రముఖులు తమ లగ్జరీ హ్యాండ్‌బ్యాగులకు లబుబు బొమ్మలను తగిలించుకొని కనిపించారు. ఇది లబుబును ఒక ఫ్యాషనబుల్ యాక్సెసరీగా మార్చటంతో మరింత క్రేజ్ పెరిగింది.
ఇక సాధారణంగా ఈ బొమ్మ ఒక బ్లైండ్ బాక్స్ ధర రూ.700 నుంచి 1500 మధ్య ఉంటుంది. ప్రత్యేక ఎడిషన్లు అయితే రూ.2000 నుంచ 10,000 వరకు, హై డిమాండ్ కలిగిన వేరియంట్లు రీసేల్ మార్కెట్‌లో రూ.20,000పైనా ఉంటాయి. ఇక ఈ బొమ్మలకు విపరీతమైన డిమాండ్ కారణంగా దుకాణాలలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. బొమ్మల కోసం పోటీ పడిన కస్టమర్ల మధ్య ఘర్షణలు కూడా జరిగాయి. భద్రతా ఆందోళనలను పరిష్కరించడానికి పాప్ మార్ట్.. యూకేలో చాలా చోట్ల లబుబు బొమ్మల దుకాణంలో అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ చర్యలు తీసుకున్నప్పటికీ, బొమ్మలు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్నాయి.






