- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral Video : బీర్ కోసం ఇంతకు తెగించావేంట్రా.. నడి రోడ్డులో కారు ఆపేసి యువకుడి హల్ చల్ (వీడియో)
ముక్క లేనిదే ముద్ద దిగని మాంసాహార ప్రియులు ఉన్నట్లే.. సుక్కేయనిదే సల్లబడని మద్యం ప్రియులు కూడా ఉంటారు. వైన్ షాపు కనిపిస్తే చాలు నోరూరుతుంది. కాళ్లు, చేతులు అదుపులో ఉంచుకోవాలన్న ఉండకుండా అక్కడికి పరుగెత్తాలని అనిపిస్తుంది. సుక్క లోపల పడితేనే మనసు

దిశ, ఫీచర్స్ : ముక్క లేనిదే ముద్ద దిగని మాంసాహార ప్రియులు ఉన్నట్లే.. సుక్కేయనిదే సల్లబడని మద్యం ప్రియులు కూడా ఉంటారు. వైన్ షాపు కనిపిస్తే చాలు నోరూరుతుంది. కాళ్లు, చేతులు అదుపులో ఉంచుకోవాలన్న ఉండకుండా అక్కడికి పరుగెత్తాలని అనిపిస్తుంది. సుక్క లోపల పడితేనే మనసు నెమ్మదిస్తుంది. ఇలాంటి కోవకు చెందినోడే ఈ యువకుడు. కారులో వెళ్తుండగా సిగ్నల్ పడిన టైంలో యువకుడికి రోడ్డుకు అపోజిట్‌లో ఓ వైన్ షాపు కనిపించింది. ఇగ ఆగాలని అనిపించలేదు. ఖతమ్ అక్కడే వెహికిల్ పడేసి పరుగెత్తుకుంటూ వెళ్లాడు. ఎవడు ఎక్కడపోతే నాకేమీ.. మందు తాగితే అయిపాయే అన్నట్లుగా ప్రవర్తించాడు. దీంతో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు.
కాగా ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు మస్త్‌గా నవ్వుకుంటున్నారు. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? అని కొందరు అంటుంటే.. ట్రాఫిక్ ఏంది? కారు ఏంది? ముందు మందు కొట్టాలే అంతే.. ఫస్ట్ ఆల్కహాల్.. ఆఫ్టర్ ఆల్.. అని ఇంకొందరు అంటున్నారు. అయితే విమర్శించిన వారు కూడా లేకపోలేదు. కేవలం మందుకోసం ట్రాఫిక్‌లో వెహికిల్ నిలిపేసి ఇతరులను ఇబ్బంది పెట్టడం స్టుపిడ్ థింగ్.. అంతగా కావాలనుకుంటే వెహికిల్ తీసుకుని వెళ్లొచ్చుగా అని కామెంట్ చేస్తున్నారు.






