- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Video:వామ్మో.. మొసలినే ఆమాంతం గాల్లోకి విసిరేసిన ఏనుగు.. తర్వాత ఏం జరిగిందో చూస్తే షాక్!
ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media) యుగం నడుస్తోంది

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media) యుగం నడుస్తోంది. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. ఇక జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా నెట్టింట ఓ వీడియో(Video) తెగ వైరల్(Viral)గా మారింది. నీటిలో నివసించే మొసలి(crocodile) అత్యంత బలమైనదనే విషయం తెలిసిందే. మొసలికి చిక్కితే ఎంత పెద్ద జంతువైనా ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందే. ఈ క్రమంలో అడవిలోని జంతువులు నీరు తాగడానికి వెళ్లడానికి కూడా భయపడుతుంటాయి. సింహాలు, పులులు కూడా మొసలి జోలికి వెళ్లవు. కానీ, ఓ వీడియోలో మాత్రం నీటిలోని మొసలికి ఏనుగు చుక్కలు చూపించింది.
వీడియో ప్రకారం.. ఓ ఏనుగు(Elephants) పిల్ల నీరు కోసం చెరువులోకి వెళ్లింది. అప్పుడే దానికి నీటిలో దాగి ఉన్న మొసలి కనిపించింది. ఇక ఆ ఏనుగు పిల్ల ఒక్కసారిగా మొసలిని తన తొండంతో బయటకు తీసుకోచ్చింది. ఆ తర్వాత అక్కడే ఉన్న పెద్ద ఏనుగు తన బిడ్డను ఏదో చేయబోతుందో అనుకుందో ఏమో కానీ.. కోపంతో ఊగిపోయి తనకున్న బలంతో మొసలిని పట్టుకుని అమాంతం గాల్లోకి ఎగిరేసింది. ఆ మొసలి ఆకాశానికి ఎగిరి ఆ ఎడారి దిబ్బ పై పడిపోయింది. ఆ తర్వాత ఏనుగు తన పిల్లతో కలిసి పరుగులు తీసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. నీటి(Water)లో నివసించే మొసలి ఏనుగు లాంటి ఇతర జంతువులతో ఎప్పుడు పోరాడలేదని కొందరు, ఏనుగులు తమ పిల్లలను రక్షించుకోవడానికి ఏమైనా చేయగలవని, అది ఏఐ అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనప్పటికి ఏఐ వచ్చాక ఏది నిజమో, ఏది అబద్ధమో చెప్పడం కష్టంగా మారిందని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.వైరల్ వీడియో






