- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఊహల్లో గడిపే రోజులు పోయాయి.. భవిష్యత్తు మొత్తం ఇలాగే ఉంటుంది కావచ్చు!
ప్రపంచం ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగంలో అడుగుపెట్టింది. ఒకప్పుడు కలలు కంటూ ఊహించుకున్న ఎన్నో అంశాలు

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగంలోకి ప్రవేశించింది. ఒకప్పుడు మన ఊహలకు మాత్రమే పరిమితమైన ఎన్నో విషయాలు.. ఇప్పుడు మన కళ్లముందే వాస్తవంగా మారిపోతున్నాయి. ఒక చిన్న ఆలోచనైనా సరే, ఇప్పుడు ఏఐ ద్వారా వీడియోగా రూపుదిద్దుకుంటోంది. మనం చెప్పినట్టే సీన్లు, పాత్రలు, ప్రదేశాలు అన్నీ ఆకట్టుకునే విధంగా రూపొందిస్తున్నారు. ఇది కేవలం టెక్నాలజీ కాదు, కలలు నిజమయ్యే సాధనంగా మారుతోంది.
ఈ క్రమంలోనే, 'స్టార్‌బక్స్ (Starbucks)' వంటి ప్రముఖ కాఫీ షాప్‌లో అందమైన రోబోలు పని చేస్తే ఎలా ఉంటుందనే ఆసక్తికరమైన వీడియోను ఏఐ ఆధారంగా రూపొందించారు. కస్టమర్లకు కాఫీ అందిస్తున్న రోబోలు, కౌంటర్ వద్ద హెల్ప్ చేస్తున్న స్మార్ట్ యంత్రాలు.. అన్నీ కలిసొచ్చేలా చూపించారు. ఇది కేవలం కల్పిత విజువల్ మాత్రమే అయినా, రాబోయే రోజుల్లో రోబోలు మానవుల దైనందిన జీవితంలో ఎంతటి భాగస్వామ్యం కావచ్చో చెబుతోంది. ఏఐ మానవ జీవనశైలిని మార్చే దిశగా ఎలా సాగుతోంది అనే దానికి ఇది మరో ఉదాహరణగా నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






