IMF: వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీగా భారత్‌కు తిరుగులేదు

by S Gopi |

ఇది ఏప్రిల్ అంచనా కంటే స్వల్పంగా 0.1 శాతం తక్కువైనప్పటికీ, 2027-28లో వృద్ధి 6.7 శాతానికి చేరుతుందని అంచనా వేసింది.

IMF: వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీగా భారత్‌కు తిరుగులేదు
X

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తాజా 'వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్' నివేదికలో భారత్‌ను మరోసారి ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థికవ్యవస్థలలో ఒకటిగా పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్స్రం (2026-27)లో భారత ఆర్థికవ్యవస్థ 6.4 శాతం వృద్ధి నమోదు చేస్తుందని, ఇది ఏప్రిల్ అంచనా కంటే స్వల్పంగా 0.1 శాతం తక్కువైనప్పటికీ, 2027-28లో వృద్ధి 6.7 శాతానికి చేరుతుందని అంచనా వేసింది. దీనికి ప్రధానంగా ప్రైవేట్ వినియోగం, సేవల రంగంలో కొనసాగుతున్న బలమైన వృద్ధి, దేశీయ డిమాండ్ భారత్‌కు ప్రధాన బలాలుగా నిలుస్తున్నాయని ఐఎంఎఫ్ పేర్కొంది. అధిక చమురు ధరలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, మందగించిన ప్రపంచ వాణిజ్యం వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశీయ వినియోగం భారత ఆర్థికవ్యవస్థను ముందుకు నడిపిస్తోందని నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచ వృద్ధికి సంబంధించి పశ్చిమాసియా ఘర్షణలు, ఇంధన ధరల పెరుగుదల ప్రభావంతో 2026లో ప్రపంచ వృద్ధి 3.0 శాతానికి తగ్గుతుందని, 2027లో 3.4 శాతానికి పుంజుకుంటుందని అభిప్రాయపడింది. అయితే ఏఐ ఆధారిత టెక్నాలజీ విస్తరణ ప్రపంచ వృద్ధికి కొత్త ఊపునిస్తోందని కూడా నివేదిక పేర్కొంది.

Next Story