కువైట్‌లో ఘోరం.. ఎడారిలో తెలంగాణ యువకుడి మృతదేహం

by Ramesh Naini |

కువైట్‌లో అదృశ్యమైన తెలంగాణ యువకుడు ఎడారిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కువైట్‌లో ఘోరం.. ఎడారిలో తెలంగాణ యువకుడి మృతదేహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: కువైట్‌లో అదృశ్యమైన తెలంగాణ యువకుడు ఎడారిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం కోరట్‌పల్లి తండాకు చెందిన గుగులోత్ కైలాశ్ (30) కువైట్‌లో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. మార్చి 19న జేసీబీ మరమ్మతుల పేరుతో ఓ వ్యక్తి అతడిని తీసుకెళ్లగా, ప్రమాదవశాత్తు కైలాశ్ మృతి చెందినట్లు సమాచారం. అనంతరం భయంతో నిందితులు మృతదేహాన్ని సాల్మి ఎడారిలో పూడ్చి పెట్టినట్లు కువైట్ పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.

కైలాశ్ అదృశ్యంపై కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కువైట్ పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఘటన వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రధాన నిందితుడు ఇటీవల స్వగ్రామానికి వచ్చినట్లు తెలిసింది. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు డిచ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, కువైట్‌లోనూ ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం.

Next Story