అనాథ పిల్లలకు అండగా ఉప్పల్ పోలీసులు

by velandi.Saikiran |

అనాథ పిల్లలకు భరోసానిస్తూ, వారి భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఉప్పల్ పోలీసులు ముందుకు వచ్చారు.

అనాథ పిల్లలకు అండగా ఉప్పల్ పోలీసులు
X

దిశ, ఉప్పల్ : అనాథ పిల్లలకు భరోసానిస్తూ, వారి భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఉప్పల్ పోలీసులు ముందుకు వచ్చారు. బుధవారం సాయంత్రం ఉప్పల్ సీఐ రామలింగారెడ్డి,ఎస్ఐ చిరంజీవితో కలిసి ఉప్పల్ పరిధిలోని అభిసాయి దత్త సాయి ట్రస్ట్,ఆక్సిలినిలియం నవజీవన్ బాలికల గృహాల‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించిన పోలీసులు, వారికి ధైర్యం నూరిపోస్తూ జీవితంలో ముందుకు సాగేందుకు ప్రేరణ ఇచ్చారు. అలాగే వ్యక్తిగత భద్రత, అపరిచితుల పట్ల అప్రమత్తత, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే పోలీసులను ఆశ్రయించాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు. పిల్లల సంక్షేమం, రక్షణ కోసం ఉప్పల్ పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని సీఐ రామలింగారెడ్డి హామీ ఇచ్చారు. చిన్నారుల భద్రత విషయంలో పోలీసులు తీసుకుంటున్న చొరవ స్థానికంగా ప్రశంసలు అందుకుంది.

Next Story