- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gold: రూ. 2 వేలు తగ్గిన బంగారం
పెరుగుతున్న చమురు ధరలు ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపవచ్చనే సంకేతాలు ఉండటం, పెట్టుబడిదారులు బంగారం కంటే అమెరికా ట్రెజరీ బాండ్లు, డాలర్ వైపు మొగ్గు చూపుతున్నారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయంగా పరిణామాలు ప్రతికూలంగా ఉండటం, అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావంతో దేశీయంగా బంగారం ధరలు బుధవారం గణనీయంగా తగ్గాయి. ఢిల్లీలో స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ. 800 తగ్గి రూ.1,48,450కు చేరగా, వెండి కిలోకు రూ.2,39,800 వద్ద స్థిరంగా కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ కూడా 1.2 శాతం పడిపోయి ఔన్సుకు 4,056.24 డాలర్ల వద్ద ట్రేడయింది. పెరుగుతున్న చమురు ధరలు ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపవచ్చనే సంకేతాలు ఉండటం, పెట్టుబడిదారులు బంగారం కంటే అమెరికా ట్రెజరీ బాండ్లు, డాలర్ వైపు మొగ్గు చూపుతున్నారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మళ్లీ ముదురుతున్నాయనే సంకేతాలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, బుధవారం రాత్రి సమయానికి హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం రూ. 2,130 క్షీణించి రూ. 1,43,330 వద్ద ఉండగా, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి పది గ్రాములు రూ. 1,950 తగ్గి రూ. 1,31,200గా ఉంది. వెండి ధరల్లో పెద్దగా మార్పులు లేకపోవడంతో కిలో రూ. 2.45 లక్షల వద్ద ఉంది.






