మమత ఉగ్రరూపం.. కార్యకర్త చెంప చెల్లు

by Muthe.Rajitha |

బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ ఓ కార్యకర్త చెంప చెళ్ళుమనిపించారు.

మమత ఉగ్రరూపం.. కార్యకర్త చెంప చెల్లు
X

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) కి సంబంధించిన ఒక వీడియో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. బరయ్‌పుర్ లో జరిగిన ఒక బాలిక అత్యాచార ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిందితులకు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తూ టీఎంసీ ఆధ్వర్యంలో కోల్‌కతాలో దీదీ నేతృత్వంలో ఒక భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇదే సమయంలో ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ (BJP) కూడా సమాంతరంగా ప్రదర్శనలు చేపట్టడంతో నగరంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

నిరసన వేళ ఉద్రిక్తత – చెంపదెబ్బ వివాదం

టీఎంసీ చేపట్టిన భారీ ర్యాలీ ముగింపు దశకు చేరుకుంటుండగా.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసం వెలుపల ఒక్కసారిగా భారీ ఎత్తున జనసందోహం గుమిగూడింది. దీంతో అక్కడ గందరగోళం, ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అంతలో అక్కడ ఉన్న గుంపులోంచి చోర్ చోర్ అని అరవడంతో.. మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వ్యక్తి చెంప చెళ్లుమనిపించారని, మరికొందరిని బలంగా పక్కకు నెట్టేశారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన విజువల్స్ సామాజిక మాధ్యమాలలో క్షణాల్లో వైరల్‌గా మారాయి.

Next Story