- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్‌పై అమెరికా భారీ వైమానిక దాడులు
ఇరాన్‌పై ఈ రాత్రికి భీకర దాడులు చేస్తామని ప్రకటించిన కొద్ది గంటల్లోనే అమెరికా భారీ ఎయిర్ స్ట్రైక్స్ కు తెగబడింది.

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ జ్వాలలు ఎగసి పడుతున్నాయి. ఇరాన్‌పై ఈ రాత్రికి భీకర దాడులు చేస్తామని హెచ్చరించిన కొద్ది గంటల వ్యవధిలోనే అమెరికా సైన్యం భారీ ఎయిర్ స్ట్రైక్స్ (Air Strikes) ప్రారంభించింది. ఇరాన్ భూభాగంలోని వ్యూహాత్మక ప్రాంతాలే లక్ష్యంగా మళ్లీ వైమానిక దాడులు చేస్తున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (US CENTCOM) అధికారికంగా ప్రకటించింది.
మిలిటరీ టార్గెట్లే లక్ష్యంగా క్షిపణుల వర్షం
వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) పరిసర ప్రాంతాలతో పాటు, ఇరాన్ ప్రధాన నౌకాశ్రయ నగరం బందర్ అబ్బాస్ (Bandar Abbas) పరిధిలోని ఇరాన్ మిలిటరీ స్థావరాలపై అమెరికా వైమానిక దళం క్షిపణులతో (Missiles) విరుచుకుపడింది. ఇరాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, కమాండ్ సెంటర్లు, క్షిపణి నిల్వ కేంద్రాలే లక్ష్యంగా ఈ దాడులు సాగుతున్నట్లు తెలుస్తోంది. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులు, చమురు విక్రయాల లైసెన్స్ రద్దు వంటి వరుస పరిణామాల తర్వాత అమెరికా ఈ స్థాయిలో నేరుగా ఇరాన్ మిలిటరీ లక్ష్యాలపై ఇంతపెద్ద ఎయిర్ స్ట్రైక్స్‌కు దిగడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ ఎలాంటి ప్రతిచర్యకు దిగబోతుందనే అంశంపై ప్రపంచ దేశాలు అత్యంత ఉత్కంఠగా గమనిస్తున్నాయి.






