- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
లగ్జరీ బ్రాండ్ల మోసాన్ని బయటపెట్టిన చైనీయులు.. నిజం తెలిస్తే మీరు కూడా షాకవుతారు!

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థలైన అమెరికా (America), చైనా (China) మధ్య వాణిజ్య యుద్ధం (Trade war) రోజు రోజుకీ తారాస్థాయికి చేరుతోంది. ఒక దేశంపై మరో దేశం భారీగా సుంకాలు విధించుకుంటూ తగ్గెదేలే అంటున్నాయి. అయితే, తయారీ రంగానికి పెద్దన్నగా ఉన్న చైనా నుంచి అమెరికన్లకు పెద్ద ఎత్తున వస్తువులు ఎగుమతి అవుతాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అమెరికా బ్రాండ్లపై చైనా జోరుగా ట్రోల్స్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ట్రోల్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోన్నాయి.
టారిఫులు పెంచటంతో ధరలు కూడా భారీగా పెరుగుతాయి. తక్కువ ధరకు లభించే వస్తువు కూడా రెట్టింపు ధర చెల్లించి కొనాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే చైనీయులు అమెరికన్ బ్రాండ్ల ధరల అసలు మతలబుని బయటపెడుతున్నారు. చైనాలో తక్కువ ధరకే లగ్జరీ వస్తువులు తయారవుతున్నాయని, కానీ అమెరికాలో అవే వస్తువులు ఖరీదైన ధరలకు అమ్ముడవుతున్నాయని వెల్లడిస్తున్నారు. ఉదాహరణకు 1,000 డాలర్ల విలువైన వస్తువు అమెరికాలో 38,000 డాలర్లకి అమ్ముడవుతోందని పేర్కొన్నారు. ఈ విషయంపై చైనీయులు పలు వీడియోలు రూపొందించారు. అలాగే, ట్రంప్ నినాదం 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్'ని వ్యంగ్యంగా చూపిస్తూ వీడియోలు చేస్తున్నారు.