రాహుల్ గాంధీకి ముద్దు పెట్టిన అమ్మాయి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

రాహుల్ గాంధీకి ముద్దు పెట్టిన అమ్మాయి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉండే ఆయన.. బయట ఎంతో ఫన్నీగా కనిపిస్తారు. అందరితో సాధారణంగా కలిసిపోతారు. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన ఏదో ఒక వీడియో రోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. కొన్ని కాంట్రావర్సీలు దారి తీస్తుండగా, ఇంకొన్ని ఫన్నీగా ఉంటాయి. తాజాగా ఆయనకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. శుక్రవారం ఆయన ఒడిశాలోని భువనేశ్వర్‌లో నిర్వహించిన ఓ పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి వేదిక మీదకు వచ్చి మరీ రాహుల్‌కు ముద్దు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

అంతకుముందు రాహుల్ మీటింగ్‌లో మాట్లాడారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై రెచ్చిపోయారు. రాజ్యాంగాన్ని మోడీ ప్రభుత్వం గౌరవించడం లేదని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వంలో ఏ వర్గానికి కూడా న్యాయం జరగడం లేదని విమర్శించారు. సామాజికన్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. దేశంలో బీజేపీపై వ్యతిరేకత పెరుగుతోందని.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు.

Next Story