Chariot Collapses: ఒక్కసారిగా భక్తులపైకి కూలిన రథం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-04-20 11:42:47  IST  )

కర్ణాటక రాష్ట్రంలోని ముల్కి (Mulki) పట్టణం సమీపంలో ఉన్న బప్పనాడు గ్రామంలో నిర్వహించిన రథోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది.

Chariot Collapses: ఒక్కసారిగా భక్తులపైకి కూలిన రథం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక రాష్ట్రంలోని ముల్కి (Mulki) పట్టణం సమీపంలో ఉన్న బప్పనాడు గ్రామంలో నిర్వహించిన రథోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. తాడు తెగడంతో రథం పైభాగం కూలిపోయింది (Top Portion Of Chariot Collapses). దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన భక్తులు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గ్రామంలోని శాంభవి నది ఒడ్డున దుర్గాపరమేశ్వరి ఆలయం ఉంది. ప్రతి ఏటా ఏప్రిల్‌లో ఆలయ వార్షికోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా బ్రహ్మరథోత్సవం జరుపుతారు. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి రథోత్సవం వేడుక నిర్వహించారు. దేవతతో పాటు పూజారులున్న రథాన్ని వేలాది మంది భక్తులు లాగారు. అయితే ఒక రథానికి కట్టిన తాడు తెగిపోయింది. దీంతో విద్యుత్‌ అలంకరణతో ఉన్న రథం పైభాగం కూలిపోయింది. అప్రమత్తమైన భక్తులు దూరంగా పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మిగతా రథాలతో ఊరేగింపును కొనసాగించారు.

Click For Tweet Post..

Next Story