- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఊళ్లోకొచ్చిన సింహాలకు చుక్కలు చూపించిన ఎద్దు
సాధరణంగా అడవిలో అయిన, గ్రామాల్లో అయిన.. సింహాన్ని చూస్తే ఏ ప్రాణికైనా వణుకు పుట్టాల్సిందే. ఎందుకంటే సింహం పంజా బలం అలాంటిది కాబట్టి.

X
దిశ, వెబ్‌డెస్క్: సాధరణంగా అడవిలో అయిన, గ్రామాల్లో అయిన.. సింహాన్ని చూస్తే ఏ ప్రాణికైనా వణుకు పుట్టాల్సిందే. ఎందుకంటే సింహం పంజా బలం అలాంటిది కాబట్టి. కానీ దీనికి విరుద్ధంగా ఓ ఎద్దు సింహాలను నడిరోడ్డుపై తరిమి తరిమి అక్కడి నుంచి పంపింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో అటవి సమీపంలో ఉన్న ఊరులోకి ఐదు సింహాలు రాగా వాటిని ఓ ఎద్దు తరమడం కనిపించింది.
ఈ విచిత్ర సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని జునాగఢ్‌లో చోటు చేసుకుంది. ఊళ్లోకి వచ్చిన సింహాలను ఎద్దు ఉరికించిన ఈ సంఘటన మొత్తం.. అక్కడున్న ఓ వ్యక్తి తన ఫోన్ కెమెరాలో రికార్డ్ చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. ఐదు సింహాలను ఒక ఎద్దు ఉరికించడంతో అంతా షాక్ అవ్వడమే కాకుండా తెగ లైకులు షేర్లు చేస్తూ.. ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.
Next Story






