- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హల్దీ వేడుకకు అలా వచ్చి షాక్ ఇచ్చిన వధువు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
పెళ్లి.. జీవితంలో ఒక్కసారి చేసుకునే గొప్ప వేడుక.

దిశ, వెబ్ డెస్క్: పెళ్లి.. జీవితంలో ఒక్కసారి చేసుకునే గొప్ప వేడుక. అందుకే అంగరంగ వైభవంగా చేసుకోవాలని అనేక జంటలు ఆశపడుతుంటారు. అందుకు తగ్గట్లుగానే ఇటీవల కాలంలో పెళ్లి కోసం భారీగా ఖర్చు పెడుతున్నారు కూడా. మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కి ఆదరణ పెరుగుతోంది. ఇక హిందూ సంప్రదాయం ప్రకారం.. పెళ్లికి ముందు అనేక కార్యక్రమాలు ఉంటాయని తెలుసు. ఇందులో భాగంగా పెళ్లికి ముందురోజు వరూవధువులకు హల్ధీ వేడుకలు నిర్వహించటం ఆనవాయితీ. అయితే, ఈ హల్ధీ వేడుకలో తన ఎంట్రీ కాబోయే భర్తకు జీవితాంతం గుర్తుండాలి అనుకుంది కావచ్చు. ఎవరు ఊహించలేని విధంగా వినూత్న ఎంట్రీ ఇచ్చి వరుడుతో సహా అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral) మారింది. ఇంతకీ ఆ వధువు ఎలా వచ్చిందని తెలుసుకోవాలని ఉందా? మరీ ఈ వార్తను పూర్తిగా చదివేయండి.
న్యూఢిల్లీకి చెందిన ఓ జంట పెళ్లి వేడుకల్లో భాగంగా హల్దీ కార్యక్రమం నిర్వహించుకున్నారు. ఈ వేడుకకు పెళ్లి కొడుకు, అతని బంధువులు, పెళ్లి కూతురి బంధువులతో విచ్చేసి.. పెళ్లి కూతురు కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడు ఒక పెద్ద డైనోసర్ కాస్ట్యూమ్‌లో ఓ వ్యక్తి అక్కడికు చేరుకుంది. అక్కడున్న అతిథులందరినీ పలకరించింది. ఆ తర్వాత డైనోసర్ కాస్ట్యూమ్‌లో ఉన్న వధువుతో వరుడు డ్యాన్స్ చేశాడు. అనంతరం ఈ డైనోసర్ ఎవరబ్బా అని గెటప్ తీసి చూస్తే అక్కడ పెళ్లి కూతురు (Bride Attends In Dinosaur Costume) ఉంది. ఇక నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. పెళ్లికూతుర్ని బ్రైడోసోర్‌గా కొందరు అభివర్ణించారు. అలాగే మరికొందరు ఆ వధువును గాడ్జిల్లా కాదు బ్రైడ్జిల్లా అని కామెంట్ చేశారు.






