- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రీల్స్ కోసం రిస్క్.. వైరల్‌గా మారిన ‘వధువు’ హైవే బైక్ రైడ్..! కానీ కథలో ట్విస్ట్ ఇదే!
సాధారణంగా పెళ్లి దుస్తులు ధరించినప్పుడు వరుడు లేదా వధువు బయటకు అడుగు పెట్టారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సాధారణంగా పెళ్లి దుస్తులు ధరించినప్పుడు వరుడు లేదా వధువు బయటకు అడుగు పెట్టారు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలంటే ఏదైనా మెంటల్ పని చేయాల్సిందే. తాజాగా పెళ్లి దుస్తులు ధరించిన ఓ యువతి హైవేపై సూపర్ బైక్‌ను పరిగెత్తిస్తూ తీసిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌ను కుదిపేస్తోంది. itztuba44 అనే యూజర్ పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకు 3.9 మిలియన్ వ్యూస్, వేలాదిగా లైక్స్, కామెంట్లు వచ్చాయి. పూర్తిగా వధువు లుక్‌లో ఉన్న ఆ యువతి హైవేపై వేగంతో బైక్ నడుపుతుండటం చూసి ఇతర వాహనదారులు కూడా ఆశ్చర్యపోయారు.
కానీ కథలో ట్విస్ట్ ఏమిటంటే..!
ఆమె అసలు పెళ్లి కూతురు కాదు. రీల్స్ కోసం మాత్రమే వధువు మేకోవర్ వేసుకుని సూపర్ బైక్‌పై స్టంట్లు చేస్తోందని నెటిజన్లు కామెంట్ సెక్షన్‌లో పేర్కొన్నారు. ఇదే ఆమె మొదటి ‘వధువు రైడ్’ కూడా కాదు. గతంలో కూడా పెళ్లి దుస్తుల్లో అనేక రీల్స్ చేసినట్లు ఆమె ఇన్‌స్టా పేజీ చెబుతోంది. అయితే రోడ్లపై ఇలా రీల్స్ కోసం రిస్క్ తీసుకోవడం సరైంది కాదని నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. ఆమె హెల్మెట్ ధరించలేదు. ఇతర వాహనదారులు రోడ్డుపై కాకుండా ఆమెపైనే ఫోకస్ చేశారు.. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. .






