లంచ్‌లో కేవలం ‘రొట్టె - చక్కెర’ తెచ్చుకున్న పిల్లాడు.. టీచర్ స్పందన చూసి నెటిజన్లు ఫిదా!

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-10 02:58:45  IST  )

స్కూల్ లంచ్‌లో కేవలం రొట్టె, చక్కెర తెచ్చుకున్న పిల్లాడి పట్ల ఓ టీచర్ వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లంచ్‌లో కేవలం ‘రొట్టె - చక్కెర’ తెచ్చుకున్న పిల్లాడు.. టీచర్ స్పందన చూసి నెటిజన్లు ఫిదా!
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా (Social Media)లో ఓ టీచర్‌కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. తన విద్యార్థి లంచ్ బాక్స్‌లో కేవలం రొట్టె, చక్కెర మాత్రమే ఉండటాన్ని చూసిన ఆ ఉపాధ్యాయురాలు, అతడిని చిన్నబోకుండా ఉండేలా ఎంతో ఆప్యాయంగా పలకరించడం నెటిజన్ల మనసు గెలుచుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన ఈ వీడియోలో, మధ్యాహ్న భోజన సమయంలో ఓ పిల్లాడు తన బాక్స్‌లో కూర లేకుండా కేవలం రొట్టె, చక్కెర మాత్రమే తెచ్చుకున్నాడు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో పిల్లలు ఇబ్బంది పడతారని భావించి, ఆ టీచర్ ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించారు. అతడిని బాధపకుండా, ఎంతో ప్రేమగా ‘బాగుంది, చక్కగా తిను’ ఎంకరేజ్ చేసింది. అయితే. పిల్లాడి ఆత్మగౌరవానికి దెబ్బతగలకుండా ఆమె వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

ఈ క్రమంలోనే ఆ వీడియో చూసిన నెటిజెన్లు (Netizens) రకరకాలుగా కామెంట్ చేస్తున్నరు ‘విద్య అంటే కేవలం పాఠాలు చెప్పడం మాత్రమే కాదు, మానవత్వాన్ని నేర్పించడం కూడా’ అని అంటున్నారు. కొందరు తమ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, ‘తాము కూడా చిన్నప్పుడు ఇలాగే తిన్నాము, ఈ వీడియో చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి’ అని భావోద్వేగానికి లోనయ్యారు. తరగతి గదిలో ఓ టీచర్ ప్రదర్శించే చిన్నపాటి సానుభూతి, పిల్లల మానసిక వికాసంపై ఎంతటి ప్రభావం చూపుతుందో ఈ సంఘటన నిరూపిస్తోంది. ఈ హార్ట్ బ్రేకింగ్ వీడియోకు ఇప్పుడు ఇంటర్నెట్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి.

Next Story