తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద వినాయకుడు.. కోటి లింగాలతో ఏర్పాటు.. ఎక్కడంటే?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-25 13:09:35  IST  )

దేశవ్యాప్తంగా వినాయకుడి ఉత్సవాల సందడి మొదలైంది. వాడవాడలా బొజ్జ గణపయ్యలను కొలువుదీర్చేందుకు నిర్వాహకులు మండపాలను అందంగా ముస్తాబుచేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద వినాయకుడు.. కోటి లింగాలతో ఏర్పాటు.. ఎక్కడంటే?
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా వినాయకుడి ఉత్సవాల సందడి మొదలైంది. వాడవాడలా బొజ్జ గణపయ్యలను కొలువుదీర్చేందుకు నిర్వాహకులు మండపాలను అందంగా ముస్తాబుచేస్తున్నారు. ప్రతి ఏడాదిలాగే వివిధ రూపాల్లో భ‌క్తుల‌కు (Devotees) దర్శనమిచ్చేందుకు గణనాథుడి ప్రతిమలు రెడీ అయిపోయాయి. ఇక కొంతమంది నిర్వాహకులు కాస్త భిన్నంగా ఆలోచించి.. గణనాథుడి ప్రతిమలను ప్రత్యేకంగా రూపొందించుకుంటుంటారు. ఇలా గతంలో పైనాపిల్, నాణేలు, నెమలి పింఛాలు, కొబ్బరి చిప్పలు, బెల్లం, చాకెట్లతో ఏర్పాటు చేసిన లంబోదరుడు ఆకట్టుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నంలోని గాజువాకలో ఉన్న కొత్తనక్కవానిపాలెం గ్రౌండ్‌లో లంబోదర చారిటబుల్ ట్రస్ట్ (Lambodhara Charitable Trust) ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లోనే 110 అడుగుల అతి పెద్ద ఎకో ఫ్రెండ్లీ వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనికి కోటి లింగా నిర్మిత గణపతిగా నామకరణం చేశారు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే.. వినాయకుడి ఎదురుగా 15 అడుగుల నంది విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. 21 రోజుల పూజల అనంతరం వినాయకుడిని ఏర్పాటు చేసిన లింగాలను భక్తులకు అందజేయనున్నారు.

Next Story