- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral: వీధి కుక్కతో ఆ పని చెయ్యాలనుకున్న ప్రముఖ యాంకర్.. షాక్ ఇచ్చిన కుక్కపిల్ల..
మనలో చాలామంది జంతు ప్రేమికులు ఉంటారు. సాధారణంగా చాలామంది జంతువులను పెంచుకోవడం తరచూ చూస్తుంటాము.

దిశ వెబ్ డెస్క్: మనలో చాలామంది జంతు ప్రేమికులు ఉంటారు. సాధారణంగా చాలామంది జంతువులను పెంచుకోవడం తరచూ చూస్తుంటాము. ఎక్కువగా కుక్కలను పెంచుకుంటూ ఉంటారు. అయితే వీధి కుక్కలను పెంచుకోవడాన్ని చాల అరుదుగా చూస్తుంటాము. ఈ నేపథ్యంలో బొలీవియాలోని ఓ న్యూస్ ఛానెల్ జంతువుల దత్తతను పోత్సహించేలా ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ఓ వీధి కుక్కను కార్యక్రమానికి తీసుకువచ్చారు. అయితే ఆ కార్యక్రమంలో కుక్క చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న యాంకర్ ఆ కుక్కపిల్లను తడుముతూ మాట్లాడుతూ ఉన్న సమయంలో ఆ కుక్కపిల్ల డెస్క్‌పైనే మల విసర్జన చేసింది.
లైవ్ లో కుక్కపిల్ల మలవిసర్జన చేయడంతో కార్యక్రమంలో ఉన్నవారంతా షాక్ అయ్యారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఛానల్ వెబ్‌సైట్ లో పంచుకున్నారు. కాగా ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలురకాలుగా స్పందిస్తున్నారు.






