- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అట్లుంటది అమ్మాయిలతోని..! అక్కడెలా పార్క్ చేశావు అక్క?
ప్రస్తుత కాలంలో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా బైకులు, కార్లు నడుపుతూ స్వతంత్రంగా ముందుకు సాగుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్:ప్రస్తుత కాలంలో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా బైకులు, కార్లు నడుపుతూ స్వతంత్రంగా ముందుకు సాగుతున్నారు. అయితే, అప్పుడప్పుడు అమ్మాయిల డ్రైవింగ్ తీరు వివాదస్పదం అవుతోంది. కారణం.. సరైన శిక్షణ లేకుండా, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా రోడ్డుపై వాహనాలు నడుపుతూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంటారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవ్వటం కూడా మనం చూస్తునే ఉన్నాం. తాజాగా ఓ యువతి స్కూటీని పార్క్ చేసిన తీరే ఈ విషయంలో మరో ఉదాహరణగా నిలిచింది. రోడ్డుపై కాకుండా, ఎవ్వరూ ఊహించని ప్రదేశంలో స్కూటీని నిలిపిన ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఏమైంది? ఎక్కడ పార్క్ చేసింది? అసలు ఆ వీడియోలో ఏముంది? అన్నీ తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే!
వైరల్ అవుతున్న వీడియోను Ghar Ke Kalesh అనే ఎక్స్ యూజర్ తన ఖాతాలో షేర్ చేశాడు. ఇందులో ఓ బిల్డింగ్ కనిపిస్తోంది. పక్కనే విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్ కూడా ఉంది. ఆ ట్రాన్‌ఫార్మర్ నుంచి బిల్డింగ్‌లోకి విద్యుత్తు తీగలు అమర్చి ఉన్నాయి. వాటి మధ్యలో ఓ స్కూటీ నిలిపి ఉంది. అయితే, ఆ స్కూటీ అక్కడి ఎలా వెళ్లిందో తెలియదు. ఆ స్కూటీ ఓనర్ అమ్మాయి దిగులుగా స్కూటీ వైపు చూస్తుండటం వీడియోలో కనిపిస్తోంది. ఇక ఆ వీడియో చూసిన నెటిజన్లు అక్కడెలా పార్క్ చేశావు అక్క? అంటూ కామెంట్లు పెడుతున్నారు.






