- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థినిపై ఉపాధ్యాయుడి దాష్టీకం.. పలిగిన పుర్రె ఎముక
ఓపికతో విద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఓపికతో విద్యార్థులకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. ఓ వైపు లైంగిక ఆరోపణలతో గురు, శిష్యుల బంధం మసకబారుతున్న వేళ క్రమశిక్షణ నెపంతో తరగతి గదిలో విద్యార్థుల దండన కట్టు తప్పుతోంది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు (Chittoor) జిల్లా పుంగనూరు (Pungnoor)లోని ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగిన దారణం చూసి తల్లిదండ్రుల ఆవేశం కట్టలు తెంచుకుంటోంది.
వివరాల్లోకి వెళితే.. క్లాస్ రూమ్‌లో అల్లరి చేస్తోందని 6 తరగతి విద్యార్థిని నాగశ్రీ (11)ని ఉపాధ్యాయుడు తలపై కర్రతో గట్టిగా కొట్టాడు. దీంతో ఆ చిన్నారి నొప్పితో విలవిలలాడిపోయింది. మరునాడు తల అంతా వాపు రావడంతో తల్లిదండ్రులు నాగశ్రీని ఆసుపత్రికి తీసుకెళ్లగా బెంగళూరు తీసుకెళ్లాలని సూచించారు. అక్కడ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించగా వచ్చిన ఎక్స్ రే రిపోర్టు చూసి వైద్యులతో పాటు తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఆ రిపోర్టులో తల ఎడమ వైపు పైభాగంలో పుర్రె ఎముక పగిలినట్లుగా తేలింది. దీంతో స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం కాస్త జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.






