KBCలో రూ.50 లక్షలు గెలిచిన తహసీల్దార్ అరెస్ట్.. వరద సహాయక నిధుల్లో రూ.2.5 కోట్ల స్కామ్

by Kema Shiva Kumar |

కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో రూ. 50 లక్షలు గెలిచి వార్తల్లో నిలిచిన మధ్యప్రదేశ్ మహిళా తహసీల్దార్‌ను తాజాగా గ్వాలియర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

KBCలో రూ.50 లక్షలు గెలిచిన తహసీల్దార్ అరెస్ట్.. వరద సహాయక నిధుల్లో రూ.2.5 కోట్ల స్కామ్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ టెలివిజన్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (KBC)లో పాల్గొని రూ.50 లక్షలు గెలుచుకుని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మహిళా తహసీల్దార్ అమితా సింగ్ తోమార్ (Amita Singh Tomar) తాజాగా అవినీతి ఆరోపణలతో అరెస్టయ్యారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగిన రూ.2.5 కోట్ల వరద సహాయక నిధుల కుంభకోణంలో ఆమె ప్రమేయం ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. అధికారుల కథనం మేరకు.. వరద బాధితులకు అందజేయాల్సిన పరిహారం నిధులను దారి మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. సుమారు రూ. 2.5 కోట్ల మేర నిధులను అనర్హులకు లేదా బోగస్ ఖాతాలకు బదిలీ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ అక్రమాల్లో సదరు తహసీల్దార్ కీలక పాత్ర పోషించారని ఆర్థిక నేరాల విభాగం (EOW) అధికారులు గుర్తించారు.

కాగా, గతంతో అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసినకౌన్ బనేగా కరోడ్‌పతి షోలో తన తెలివితేటలతో రూ.50 లక్షలు గెలిచిన సమయంలో ఆమె ఒక ఆదర్శవంతమైన అధికారిగా ప్రశంసలు అందుకున్నారు. అయితే, ఇప్పుడు ఇంతటి భారీ స్థాయిలో ప్రజల సొమ్మును పక్కదారి పట్టించిన కేసులో నిందితురాలిగా పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆమెపై అవినీతి నిరోధక చట్టం, ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు, గ్వాలియర్‌లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణంలో మరికొంతమంది అధికారుల హస్తం ఉందా అనే కోణంలో విచారణ ముమ్మరం చేశారు.

Next Story