- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైలులో ఫుడ్ డెలివరీ చేసి దారుణంగా పడ్డాడు.. షాకింగ్ వీడియో వైరల్
ఫుడ్ డెలివరీ చేసిన ఓ డెలివరీ బాయ్ ట్రైన్ దిగుతూ కిందపడిపోయాడు. ఈ షాకింగ్ ఘటన ఏపీలోని అనంతపూర్ లో చోటు చేసుకుంది. ప్రశాంతి ఎక్స్ ప్రెస్ లో ఏసీ కోచ్ లో ఫుడ్ డెలివరీ చేసేందుకు వచ్చిన ఓ డెలివరీ బాయ్ ఫుడ్ అందజేశాడు.

దిశ, వెబ్ డెస్క్: ఫుడ్ డెలివరీ చేసిన ఓ డెలివరీ బాయ్ ట్రైన్ దిగుతూ కిందపడిపోయాడు. ఈ షాకింగ్ ఘటన ఏపీలోని అనంతపూర్ లో చోటు చేసుకుంది. ప్రశాంతి ఎక్స్ ప్రెస్ లో ఏసీ కోచ్ లో ఫుడ్ డెలివరీ చేసేందుకు వచ్చిన ఓ డెలివరీ బాయ్ ఫుడ్ అందజేశాడు. అయితే రైలు ఒకటి రెండు నిమిషాలు మాత్రమే ఆగి అక్కడ నుండి కదలడంతో వెంటనే దిగే ప్రయత్నం చేసి కిందపడిపోయాడు. రైలు వేగంగా వెళుతుండగా డెలివరీ బాయ్ కిందకు దిగి దారుణంగా పడిపోయాడు.
దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. దీంతో రైలు ఎంత ఆలస్యంగా వచ్చినా ప్రయాణికులు వెయిట్ చేస్తారని, కానీ ఒక్క నిమిషం కూడా సరిగా స్టేషన్ లలో ఆగదని నెటిజన్లు మండిపడుతున్నారు. రైలు స్టేషన్లలో కొద్దిసేపు ఆగితే ఇలాంటి ప్రమాదాలు జరగవు అని కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోకు స్విగ్వీ సైతం రిప్లై ఇచ్చింది. డెలివరీ బాయ్స్ రైలు ఎక్కి ఫుడ్ డెలివరీ చేయవద్దని చెప్పింది. కిందపడిన డెలివరీ బాయ్ గురించి ఆరా తీశామని అతడు క్షేమంగానే ఉన్నాడని పేర్కొంది.






