- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral video: సూపర్ ఐడియా.. ట్రాక్టర్‌ను ఎలా మార్చేశారో చూడండి!
దిస్ ఇజ్ ఇండియా (India).. ఇక్కడ క్రియేటివిటీకి కొదవలేదు.

దిశ, వెబ్ డెస్క్: దిస్ ఇజ్ ఇండియా (India).. ఇక్కడ క్రియేటివిటీకి కొదవలేదు. ఇందుకు సంబంధించిన ఎన్నో వీడియోలు కూడా నిత్యం సోషల్ మీడియాలో (Social media) వైరల్ అవ్వటం చూస్తుంటాం. కొందరు పాత వాహనాలను సరికొత్తగా మార్చితే.. మరికొందరు ఒక వాహనం విడి భాగాలను మరో వాహనానికి అమర్చుతుంటారు. అలాగే ఇంకొందరు తమ వాహనాన్ని ముందు ఒక తరహాలో, వెనుక ఇంకో తరహాలో డిజైన్ చేసుకోవడం కూడా చూస్తుంటాం. వీటికి నెట్టింట విపరీతంగా లైకులు, వ్యూస్ వస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో ఓ వ్యక్తి తన ట్రాక్టర్‌ను (Tractor) మార్చుకున్న తీరుకు నెటిజన్లు ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు.
సాధారణంగా ట్రాక్టర్ అనగానే మనకు రైతులే గుర్తుకు వస్తుంటారు. ఇక రైతులకు దుక్కి దున్నటం, ధాన్యాన్ని తరలించటం వంటి అనేక అవసరాలకు ట్రాక్టర్ ఉపయోగపడుతుంటుంది. అయితే, ట్రాక్టర్ ఇంజిన్ భాగం, ట్రాలీ రెండు పూర్తి ఓపెన్‌గా ఉంటాయి. దీంతో ఇది ఎండ నుంచి, వాన నుంచి డ్రైవర్‌కు రక్షణ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తన క్రియేటివిటీని బయటపెట్టాడు. ఎండలో, వానలో తన ట్రాక్టర్ వినియోగించుకునే విధంగా తీర్చిదిద్దుకున్నాడు. ఇందు కోసం అతడు డీసీఎం భాగాలను ట్రాక్టర్ ఇంజిన్‌కు అమర్చాడు. దీంతో ఈ ట్రాక్టర్ చూసేందుకు డీసీఎంలానే కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వటంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా చూస్తే మెచ్చుకుంటారంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.






