- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పొలానికి దిష్టి తగలకుండా సన్నీ లియోన్.. నెట్టింట వైరల్
పొలానికి దిష్టి తగలకుండా, అక్కడకు జంతువులు పక్షులు వచ్చి పంటను నాశనం చేయకుండా రైతులు దిష్టి బొమ్మలు పెడుతుంటారు. కానీ ఓ రైతు పొలానికి దిష్టి తగలకుండా ఉండేందుకు ఒకప్పటి పార్న్ స్టార్ ప్రస్తుత బాలీవుడ్ నటి సన్నీలియోనీ ఫోటోలను పెట్టాడు.

దిశ, వెబ్ డెస్క్: పొలానికి దిష్టి తగలకుండా, అక్కడకు జంతువులు పక్షులు వచ్చి పంటను నాశనం చేయకుండా రైతులు దిష్టి బొమ్మలు పెడుతుంటారు. కానీ ఓ రైతు పొలానికి దిష్టి తగలకుండా ఉండేందుకు ఒకప్పటి పార్న్ స్టార్ ప్రస్తుత బాలీవుడ్ నటి సన్నీలియోనీ ఫోటోలను పెట్టాడు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. ముదనూరుకు చెందిన రైతు ఈ వినూత్న ఆలోచన చేశాడు.
తాను వేసిన పత్తి పంటకు దిష్టి తగలకుండా సన్నీలియోనీ బొమ్మను పెట్టినట్టు రైతు చెబుతున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు తమ స్టైల్ లో కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటివి జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఓ రైతు తన పొలంలో తమన్నా పోస్టర్ పెట్టాడు. ఇక మరో రైతు కాజల్ అగర్వాల్, సమంత పోస్టర్లను ఏర్పాటు చేశాడు.






