- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాపం.. మనుషుల్లేక బెంగ పెట్టుకున్న చేప.. సిబ్బంది ఏం చేశారో చూడండి?
సాధారణంగా జంతువులు మనుషులపై ఎంతో ప్రేమ చూపిస్తాయి. ఒక్కసారి కనెక్ట్ అయితే అస్సలు విడిచిపెట్టవు.

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా జంతువులు మనుషులపై ఎంతో ప్రేమ చూపిస్తాయి. ఒక్కసారి కనెక్ట్ అయితే అస్సలు విడిచిపెట్టవు. మనం కనిపించకపోతే ఎంతో బెంగపెట్టుకుంటాయి. మనం కనిపించేవరకు నిద్రపోకుండా, భోజనం చేయకుండా ఎదురుచూస్తూ ఉంటాయి. ఇందుకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి ఓ ఘటనే చోటు చేసుకుంది.
జపాన్‌లోని షిమోనోసెకి కైక్యోకాన్ అక్వేరియాన్ని పునరుద్ధరణ పనుల కోసం మూసివేశారు. జనాలు రావటాన్ని కూడా ఆపేశారు. అయితే, ఇందులో ఉండే ఒకే ఒక్క సన్ ఫిష్(Sunfish) నిత్యం మనుషులను చూడటం అలవాటు పడి.. వారి జాడ లేకపోవడంతో బెంగపెట్టుకుంది. తిండి తినడం కూడా మానేసింది. అంతేకాదు, దాని శరీరాన్ని ట్యాంక్‌కేసి రుద్దడం మొదలుపెట్టింది. మొదట దాని పరిస్థితి చూసి సిబ్బంది ఏదైనా అనారోగ్యం కారణంగా తినడం లేదేమోనని భావించారు సిబ్బంది. తర్వాత అది విజిటర్స్ లేక ఒంటరితనంతో బాధపడుతుందేమోనని అనుమానించారు.
దాని సమస్య తెలుసుకునేందుకు సిబ్బంది యూనిఫామ్‌లను అక్వేరియం దగ్గర్లో వేలాడదీశారు. అలాగే, బయట మనుషుల కటౌట్‌లు ఏర్పాటుచేశారు. ఆశ్చర్యకరంగా తర్వాత రోజు నుంచి ఆ సన్‌ఫిష్(Sunfish) ప్రవర్తనలో మార్పు కనిపించింది. మళ్లీ హుషారుగా నీటిలో ఈదటం ప్రారంభించింది. ఈ విషయాన్ని అక్వేరియం నిర్వాకులు సోషల్ మీడియాలో పోస్టు చేయగా, ప్రస్తుతం వైరల్‌గా మారింది.






