- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాకో షుగర్ డాడీ కావాలి.. యువతి వీడియో వైరల్
ఈ తరం పిల్లలు ఎలా అయిపోయారంటే.. బంధాలు - బాంధవ్యాలు.. ఆప్యాయతలు-అనురాగాలు.. ప్రేమ - మమకారం.. పేగు బంధం.. ఇవేవీ అక్కర్లేదు. జస్ట్ మనీ

దిశ, వెబ్ డెస్క్: ఈ తరం పిల్లలు ఎలా అయిపోయారంటే.. బంధాలు - బాంధవ్యాలు.. ఆప్యాయతలు-అనురాగాలు.. ప్రేమ - మమకారం.. పేగు బంధం.. ఇవేవీ అక్కర్లేదు. జస్ట్ మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నట్లు తయారయ్యారు. కన్న తల్లిదండ్రుల కన్నా కూడా డబ్బుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. పరువు, ప్రతిష్టల కంటే సంపాదనకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలాంటిదే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.
ఇక ఈ క్లిపింగ్‌లో భర్త చనిపోయి బాధపడుతున్న భార్య ముందుగా కనిపిస్తుంది. ఆమె దగ్గరకు వచ్చిన కూతురు తల్లిని ఓదారుస్తుంది అని ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్. విధవగా ఉండి బాధపడే బదులు తనకో షుగర్ డాడీని తేవొచ్చు కదా అని తల్లిని ఆటపట్టిస్తుంది. డబ్బున్న వ్యక్తిని చూసుకుని పెళ్లి చేసుకోవాలని.. తనకు మంచి జీవితం ఇవ్వాలని కోరుతుంది. దీనిపై రియాక్ట్ అవుతున్న నెటిజన్లు.. దారుణంగా తిట్టిపోస్తున్నారు. తండ్రి చనిపోతే బాధపడాల్సింది పోయి.. తల్లిని ఓదార్చాల్సింది పోయి.. ఇలాంటి చీప్ సజెషన్స్, చీప్ థాట్స్‌తో వీడియోలు చేయడం సిగ్గుచేటని ట్రోల్ చేస్తున్నారు. పెళ్లి చేసుకున్నాక ఆ వచ్చిన స్టెప్ ఫాదర్ నిన్ను ఏం చేయకుండా ఉంటాడని గ్యారెంటీ ఉందా? నీకు, నీ తల్లికి కూడా ప్రమాదమే కదా? అని ప్రశ్నిస్తున్నారు. మంచిగా జాబ్ చేసి తల్లిని బాగా చూసుకోవాలని సూచిస్తున్నారు.






