విద్యార్థులతో టాయిలెట్లు కడిగించిన టీచ‌ర్లు..వీడియో వైర‌ల్

by velandi.Saikiran |

విద్యార్థులతో టాయిలెట్లు టీచ‌ర్లు కడిగించిన సంఘ‌ట‌న త‌మిళ‌నాడులో చోటు చేసుకుంది.

విద్యార్థులతో టాయిలెట్లు కడిగించిన టీచ‌ర్లు..వీడియో వైర‌ల్
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితులు రోజు రోజుకు దారుణంగా తయారవుతున్నాయి. విద్యార్థుల చేతనే వెట్టి చాకిరి చేయిస్తున్నారు టీచర్లు. ఇలాంటి సంఘటనలు ఈ మధ్య చాలానే జరుగుతున్నాయి. అయితే లేటెస్ట్ గా నాలుగో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులతో టాయిలెట్స్ క్లీన్ చేయించిన సంఘటన తమిళనాడులో జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

హోం వ‌ర్క్ చేయ‌లేద‌న్న కార‌ణంతో !

తమిళనాడులోని శివగంగ జిల్లా ప‌రిధి మల్లాకోటాయి అనే గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల చాలా సంవత్సరాలుగా ఆదర్శంగా నిలుస్తోంది. అయితే ఇలాంటి ఆదర్శ పాఠశాలలో విద్యార్థులతో వ్యక్తి చాకిరి చేయించుకున్న సంఘటన బయటకు వచ్చింది. హోంవర్క్ చేయలేదన్న ఒక కారణంతో నాలుగో తరగతి చదువుతున్న ఇద్దరు కుర్రాళ్లతో టాయిలెట్స్ క్లీన్ చేయించారు టీచర్లు. ఈ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపల్ ఆదేశాల మేరకే ఈ దుర్మార్గం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో, విద్యాశాఖ విచారణ మొదలు పెట్టింది. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సంఘ‌ట‌న‌పై ఇంకా వివ‌రాలు తెలియాల్సి ఉంది. క్లిక్

Next Story